సముద్రంలోకి 2.71 లక్షల క్యూసెక్కులు విడుదల

ABN , First Publish Date - 2020-10-20T06:54:16+05:30 IST

గోదావరిలో వరదనీరు అధికంగా వచ్చి చేరుతుంది. సోమవారం సాయంత్రం బ్యారేజీ వద్ద 10.65 అడుగుల

సముద్రంలోకి 2.71 లక్షల క్యూసెక్కులు విడుదల

కొవ్వూరు, అక్టోబరు 19 : గోదావరిలో వరదనీరు అధికంగా వచ్చి చేరుతుంది.  సోమవారం సాయంత్రం బ్యారేజీ వద్ద 10.65 అడుగుల నీటిమట్టం నమోదైంది. ఎగువ నుంచి వస్తున్న వరద ప్రవాహాన్ని బ్యారేజీకి ఉన్న 175 గేట్లు కొంత మేర ఎత్తి 2 లక్షల 71 వెయ్యి 774 క్యూసెక్కుల వరద ప్రవాహాన్ని దిగువకు విడుదల చేస్తున్నారు.

బ్యారేజీ దిగువున మూడు ప్రధాన డెల్టా కాలువల గేట్లను మూసి వేశారు. ఉభయగోదావరి జిల్లాల్లో వర్షాలు విస్తారంగా కురవడంతో డెల్టా కాలువల నీటి విడుదల నిలిపివేసినట్టు ఈఈ  ఆర్‌. మోహనరావు తెలిపారు. 

 

Updated Date - 2020-10-20T06:54:16+05:30 IST