ఉమ్మడి జిల్లాలో 27 పాజిటివ్‌

ABN , First Publish Date - 2020-08-04T10:43:11+05:30 IST

ఉమ్మడి జిల్లాలో సోమవారం 27 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. నల్లగొండ జిల్లాలో 11, సూర్యాపేటలో 11, యాదాద్రి

ఉమ్మడి జిల్లాలో 27 పాజిటివ్‌

ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌, ఆగస్టు 3: ఉమ్మడి జిల్లాలో సోమవారం 27 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. నల్లగొండ జిల్లాలో 11, సూర్యాపేటలో 11, యాదాద్రి జిల్లాలో 5 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి.


భూదాన్‌పోచంపల్లి మండలంలోని దేశ్‌ముఖిలో ఎనిమిది మందికి పరీక్షలు చేయగా, ముగ్గురికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది.


మిర్యాలగూడలో నివాసం ఉంటున్న, దామరచర్ల మండలంలోని వాడపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కరోనాతో హైదరాబాద్‌లో చికిత్సపొందుతూ మృతిచెందాడు.


కొండమల్లేపల్లి పీహెచ్‌సీలో తొమ్మిది మందికి రాపిడ్‌ పరీక్షలు చేయగా, ఏడుగురికి పాజిటివ్‌ వచ్చింది. అందులో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు, మరో కుటుంబానికి చెందిన ఇద్దరు ఉన్నారు. దీంతో మండలంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 18కి చేరింది.


దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రిలో 57 మందికి రాపిడ్‌ పరీక్షలు చేయగా, 12 మందికి పాజిటివ్‌ వచ్చింది.


మేళ్లచెర్వు మండలంలోని కందిబండలో ఒకరికి పాజిటివ్‌ వచ్చింది. అతడి కాంటాక్టులను గుర్తించి హోంక్వారంటైన్‌ చేశారు.


వేములపల్లి మండలంలోని ఆమనగల్లు గ్రామానికి చెందిన 35ఏళ్ల వ్యక్తి కరోనాతో చికిత్స పొందుతూ మృతిచెందాడు.


యాదాద్రిగుట్ట మండలంలోని పెద్దకందుకూర్‌ గ్రామానికి చెందిన ఇద్దరికి పాజిటివ్‌ వచ్చింది.


నల్లగొండ నాగార్జున గ్రామీణ వికాస్‌ బ్యాంక్‌ మెయిన్‌ బ్రాంచ్‌ చీఫ్‌ మేనేజర్‌ కరోనాతో చికిత్స పొందుతూ హైదరాబాద్‌లో మృతి చెందారు.


నకిరేకల్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో 21మందికి రాపిడ్‌ పరీక్షలు చేయగా, ఐదుగురికి పాజిటివ్‌ వచ్చింది. అందులో తిప్పర్తి రోడ్డులో నివాసం ఉండే ఒకే కుటుంనాకి చెందిన ముగ్గురు, చీమలగడ్డ ప్రాంతానికి చెందిన ఒకరు, నల్లగొండలో నివాసం ఉంటున్న మరొకరు ఉన్నారు.

Updated Date - 2020-08-04T10:43:11+05:30 IST