Abn logo
Sep 21 2021 @ 09:34AM

27 నుంచి ఇంజనీరింగ్‌ జనరల్‌ కౌన్సెలింగ్‌

పెరంబూర్‌(చెన్నై): ఇంజనీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి జనరల్‌ కేటగిరి ఆన్‌లైన్‌ కౌన్సెలింగ్‌ ఈనెల 27న ప్రారంభమై అక్టోబరు 17 వరకు నాలుగు విడతల్లో జరుగనుంది. ఈ మేరకు సాంకేతిక విద్యా కౌన్సిల్‌ ఒక ప్రకటన విడుదల చేసింది. అన్నా విశ్వవిద్యాలయ పరిధిలోని ఇంజనీరింగ్‌ కళాశాలల్లో మొదటి సంవత్సరం అడ్మిషన్లకు 1.74 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 1.45 లక్షల మంది మాత్రమే రుసుము చెల్లించగా, 2,722 మంది సర్టిఫికెట్లు నమోదు చేయలేదు. అదే సమయంలో 3,290 దరఖాస్తులను పలు కారణాలతో తిరస్కరించగా, మిగిలిన 1,36,973 మందితో కూడిన ర్యాంకుల జాబితా ఇటీవల విడుదలైంది. ఈ నేపథ్యంలో, విద్యార్థుల జనరల్‌ కేటగిరీ కౌన్సెలింగ్‌ వివరాలు ఇలా ఉన్నాయి.


- ఒకటి నుంచి 14,788 ర్యాంకు విద్యార్థులు ఈ నెల 27 నుంచి అక్టోబరు 5వ తేదీ వరకు జరిగే తొలి విడత కౌన్సెలింగ్‌లో పాల్గొనవచ్చు.

- 14,789 నుంచి 45,227 ర్యాంకు వరకు అక్టోబరు 1 నుంచి 5వ తేదీ వరకు జరిగే రెండవ విడత కౌన్సెలింగ్‌లో పాల్గొనవచ్చు.

- 42,229 నుంచి 86,118 ర్యాంకు వరకు అక్టోబరు 3 నుంచి 13వ తేదీ వరకు జరిగే మూడవ విడత కౌన్సెలింగ్‌లో పాల్గొనవచ్చు.

- 86,118 నుంచి 1,36,973 ర్యాంకు వరకు అక్టోబరు 9 నుంచి 17వ తేదీ వరకు జరిగే నాలుగో విడత కౌన్సెలింగ్‌లో పాల్గొనవచ్చు.