26,99,217 ఉమ్మడి జిల్లా ఓటర్లు

ABN , First Publish Date - 2022-01-06T06:11:15+05:30 IST

ఎన్నికల కమిషన్‌ ఉమ్మడి నల్లగొండ జిల్లా తుది ఓటర్ల జాబితాను ఖరారు చేసింది. ఆ జాబితా లెక్కల ప్రకారం ముసాయిదా జాబితాతో పోలిస్తే ఓటర్ల సంఖ్య తగ్గింది. ఉమ్మడి జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో అత్యధికంగా హుజూర్‌నగర్‌లో, అత్యల్పంగా భువనగిరిలో ఓటర్లు ఉన్నారు.

26,99,217 ఉమ్మడి జిల్లా ఓటర్లు

నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో మహిళా ఓటర్లే అధికం

హుజూర్‌నగర్‌లో అత్యధికంగా 2,38,490

అత్యల్పంగా భువనగిరిలో 2,01,509

తగ్గిన 1,009 మంది ఓటర్లు 


నల్లగొండ, జనవరి 5 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ఎన్నికల కమిషన్‌ ఉమ్మడి నల్లగొండ జిల్లా తుది ఓటర్ల జాబితాను ఖరారు చేసింది. ఆ జాబితా లెక్కల ప్రకారం ముసాయిదా జాబితాతో పోలిస్తే ఓటర్ల సంఖ్య తగ్గింది. ఉమ్మడి జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో అత్యధికంగా హుజూర్‌నగర్‌లో, అత్యల్పంగా భువనగిరిలో ఓటర్లు ఉన్నారు. ముసాయిదా జాబితా ప్రకారం ఉమ్మడి జిల్లాలో 27,00,226 మంది ఓటర్లు కాగా తుది జాబితాకు వచ్చే సరికి ఆ సంఖ్య 26,99,217కు ఖరారైంది. ముసాయిదా, తుది జాబితాతో పోల్చి చూస్తే సూర్యాపేట జిల్లాలో ఓటర్ల సంఖ్య పెరగగా నల్లగొండ, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో తగ్గారు. నల్లగొం డ జిల్లాలో ముసాయిదా జాబితా ప్రకారం 13,59,416 మంది ఓటర్లు కాగా తుది జాబితా చూస్తే ఆ సంఖ్య 13,58,185 అంటే మొత్తంగా ఆ జిల్లాలో 1,231 మంది తగ్గారు.సూర్యాపే ట జిల్లా విషయానికొస్తే ముసాయిదా జాబితా ప్రకారం 9,22,803మంది ఓటర్లు కాగా, తు ది జాబితాలో ఆ సంఖ్య కొంత పెరిగి 9,23,992కు చేరింది. అంటే 1,189మేర ఓటర్లు పెరి గారు. అదే యాదాద్రి జిల్లా విషయానికి వస్తే ముసాయిదా జాబితా ప్రకా రం 4,18,007 మంది ఓటర్లు కాగా, తుది జాబితా ప్రకారం 4,17,040కు ఖరారైంది. అంటే 967 ఓట్లు తగ్గా యి. నల్లగొండ జిల్లాలో పురుష ఓటర్ల సంఖ్య 6,78,447 కాగా, మహిళా ఓటర్ల సంఖ్య 6,79,725గా నమోదైంది. ఈ జిల్లాలో పురుష ఓటర్లతో పోలిస్తే స్త్రీ ఓటర్ల సం ఖ్య 1,278 అధికంగా ఉంది. ఇదే తరహాలో సూర్యాపేట జిల్లాలోనూ పరుషుల సంఖ్య 4,57,122 కాగా, మహిళా ఓటర్ల సంఖ్య 4,66,849గా నమోదైం ది. అంటే పురుషులతో పోలిస్తే ఈ జిల్లాలో 9,727 మంది మహి ళా ఓటర్లు అధికంగా ఉన్నారు. థర్డ్‌ జెండర్‌ (ఇతరులు) ఓట్లు అత్యధికంగా కోదాడలో 9 నమోదు కాగా, భువనగిరి నియోజకవర్గంలో ఒక్క ఓటు కూడా నమోదు కాలేదు. 


నల్లగొండ జిల్లాలో తుది ఓటర్ల జాబితా వివరాలు

నియోజకవర్గం            పురుషులు         స్త్రీలు         ఇతరులు మొత్తం ఓటర్లు

దేవరకొండ(ఎస్టీ)    1,18,338 1,15,664 5         2,34,007

నాగార్జునసాగర్‌     1,09,503 1,11,634 0         2,21,137

మిర్యాలగూడ             1,08,395 1,11,108 2 2,19,505

నల్లగొండ              1,10,248 1,13,629 0 2,23,877

మునుగోడు              1,15,415 1,11,682 4 2,27,101

నకిరేకల్‌(ఎస్సీ)     1,16,548 1,16,008 2 2,32,558

మొత్తం                     6,78,447 6,79,725 13 13,58,185

యాదాద్రి భువనగిరి జిల్లా 

భువనగిరి             1,01,125 1,00,384 0 2,01,509

ఆలేరు                     1,08,293 1,07,234 4 2,15,531

మొత్తం             2,09,418 2,07,618 4 4,17,040

సూర్యాపేట జిల్లా  

హుజూర్‌నగర్‌              1,17,342 1,21,144 4 2,38,490

కోదాడ                     1,10,374 1,14,578 9 2,24,961

సూర్యాపేట             1,10,379 1,13,731 3 2,24,113

తుంగతుర్తి             1,19,027 1,17,396 5 2,36,428

మొత్తం                     4,57,122 4,66,849 21 9,23,992

ఉమ్మడి జిల్లా మొత్తం  

మొత్తం                     13,44,987 13,54,192 38 26,99,217

Updated Date - 2022-01-06T06:11:15+05:30 IST