న్యూఢిల్లీ : దేశంలో కొత్తగా 2,628 కరోనా కేసులు నమోదయ్యాయి. 18 మంది కరోనాతో మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో 15,414 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. దేశంలో మొత్తంగా కరోనా కేసుల సంఖ్య 4,31,44,820కి చేరింది. కరోనాతో మొత్తంగా ఇప్పటి వరకూ 5,24,525 మంది మృతి చెందారు. దేశంలో కరోనా రికవరీ రేటు 98.75 శాతంగా నమోదైంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 192.82 కోట్ల టీకా డోసుల పంపిణీ జరిగింది.