Cochin Shipyardలో 261 పోస్టులు

ABN , First Publish Date - 2022-05-27T23:34:17+05:30 IST

భారత ప్రభుత్వ పోర్టులు, షిప్పింగ్‌, వాటర్‌వేస్‌ మంత్రిత్వశాఖకు చెందిన కొచ్చిలోని కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌(Cochin Shipyard) లిమిటెడ్‌ కింద పేర్కొన్న ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది...

Cochin Shipyardలో 261 పోస్టులు

భారత ప్రభుత్వ పోర్టులు, షిప్పింగ్‌, వాటర్‌వేస్‌ మంత్రిత్వశాఖకు చెందిన కొచ్చిలోని కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌(Cochin Shipyard) లిమిటెడ్‌ కింద పేర్కొన్న ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

సీనియర్‌షిప్‌ డ్రాఫ్ట్స్‌మెన్లు: 16

విభాగాలు: మెకానికల్‌, ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్స్‌, ఇన్‌స్ట్రుమెంటేషన్‌

జూనియర్‌ టెక్నికల్‌ అసిస్టెంట్లు: 05

విభాగాలు: మెకానికల్‌, ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్స్‌, ఏబీఏపీ

ల్యాబొరేటరీ అసిస్టెంట్లు: 02(మెకానికల్‌, కెమికల్‌)

స్టోర్‌ కీపర్‌: 04

జూనియర్‌ కమర్షియల్‌ అసిస్టెంట్లు: 02

అసిస్టెంట్లు: 07

వెల్డర్‌ కమ్‌ ఫిట్టర్‌: 206

విభాగాలు: వెల్డర్‌, ప్లంబర్‌, మెకానిక్‌ డీజిల్‌, ఫిట్టర్‌, షీట్‌మెటల్‌ వర్కర్‌

ఫిట్టర్‌: 16(ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్స్‌)

షిప్‌రైట్‌ ఉడ్‌: 03

అర్హత: పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, సంబంధిత ట్రేడులు/సబ్జెక్టుల్లో ఐటీఐ, ఇంజనీరింగ్‌ డిప్లొమా, బీసీఏ, బీఎస్సీ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవంతోపాటు టెక్నికల్‌ నాలెడ్జ్‌ ఉండాలి.

వయసు: 2022 జూన్‌ 06 నాటికి 35 ఏళ్లు మించకుండా ఉండాలి

ఎంపిక విధానం: ఆబ్జెక్టివ్‌ టైప్‌ ఆన్‌లైన్‌ టెస్ట్‌, ప్రాక్టికల్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి

దరఖాస్తు ఫీజు: ఇతరులు రూ.400 చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజు లేదు.

దరఖాస్తులకు చివరి తేదీ: జూన్‌ 06

వెబ్‌సైట్‌:  https://cochinshipyard.in/

Updated Date - 2022-05-27T23:34:17+05:30 IST