26 ఏళ్ల MBA యువతి ఆ ఫేస్‌బుక్ ఫ్రెండ్ మాటల్ని ఇంత ఈజీగా ఎలా నమ్మింది..? ప్రియుడి పిలిచాడని వెళ్లి హోటల్‌లో ఉంటే..

ABN , First Publish Date - 2021-10-08T21:26:33+05:30 IST

సమయం దొరికిందని ఎంబీఏ చదువుతున్న ఆ 26 ఏళ్ల యువతి ఫేస్‌బుక్ ఖాతా తెరిచింది. అందులో స్నేహితులతో కాసేపు చిట్‌చాట్ చేసింది. అపుడే ఆమెకు ఒక అపరిచిత వ్యక్తి నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. ఆమె దాన్ని ఆక్సెప్ట్ చేసింది.

26 ఏళ్ల MBA యువతి ఆ ఫేస్‌బుక్ ఫ్రెండ్ మాటల్ని ఇంత ఈజీగా ఎలా నమ్మింది..? ప్రియుడి పిలిచాడని వెళ్లి హోటల్‌లో ఉంటే..

సమయం దొరికిందని ఎంబీఏ చదువుతున్న ఆ 26 ఏళ్ల యువతి ఫేస్‌బుక్ ఖాతా తెరిచింది. అందులో స్నేహితులతో కాసేపు చిట్‌చాట్ చేసింది. అపుడే  ఆమెకు ఒక అపరిచిత వ్యక్తి నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. ఆమె దాన్ని ఆక్సెప్ట్ చేసింది. అప్పటి నుంచి ఇద్దరూ స్నేహితులయ్యారు. ఫోన్ నెంబర్లు కూడా మార్చుకుని మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే వారిద్దరు ప్రేమికులయ్యారు. ఓ రోజు ప్రియుడు పిలిచాడని ఓ ప్రాంతానికి వెళ్లి అక్కడున్న హోటల్ లో దిగింది. ఆ తర్వాత జరిగిందో షాకింగ్ ఘటన. పూర్తి వివరాల్లోకెళ్తే..


మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌కు చెందిన 26 ఏళ్ల యువతి ఎంబీఏ చదువుతోంది. ఆమెకు ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌కు చెందిన అర్చిత్ సలూజ అనే వ్యక్తితో ఫేస్‌బుక్‌లో పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి వారిద్దరు ఫోన్లలో మాట్లాడుకునేవారు. ఈ క్రమంలోనే వారిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. అయితే ఓ రోజు ఆ యువతికి ప్రియుడి నుంచి ఫోన్ వచ్చింది. పెళ్లి చేసుకుందామని మాయమాటలు చెప్పి ఆమెను కాన్పూర్‌కు రమ్మన్నాడు.అతడి మాటలు నమ్మి ఆ యువతి అక్కడికి వెళ్లింది. అపుడు ఆమెను హోటల్‌ గదిలో ఉంచి, మూడు రోజులు అఘాయిత్యానికి పాల్పడ్డాడు.


అంతేకాకుండా ఆమెతో సన్నిహితంగా ఉన్నపుడు వీడియోలు కూడా తీశాడు. మూడు రోజుల తర్వాత ఆమెను.. కాన్పూర్‌లో మళ్లీ కనిపిస్తే చంపేస్తానని,  విషయం ఎవరికైనా చెప్తే వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరించాడు. పెళ్లి చేసుకునేది లేదని తేల్చి చెప్పాడు. దీంతో బాధితురాలు తనకు న్యాయం చేయాలని అర్చిత్ తండ్రి వద్దకు వెళ్లింది. అతను కూడా ఆమెపై తన క్రూరత్వాన్ని ప్రదర్శించాడు. అపుడు సదరు యువతి మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు త్వరలోనే కాన్పూర్ వెళ్లి నిందితులైన తండ్రి, కొడుకులను అరెస్టు చేస్తామన్నారు.

Updated Date - 2021-10-08T21:26:33+05:30 IST