క్వారంటైన్‌ కేంద్రాల్లో 255 మంది

ABN , First Publish Date - 2020-03-31T12:20:33+05:30 IST

జిల్లాలో ఇప్పటివరకు మొత్తం 73 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. వీరిలో శ్రీకాళహస్తికి చెందిన

క్వారంటైన్‌ కేంద్రాల్లో 255 మంది

ఇప్పటివరకు 73 మందికి కరోనా పరీక్షలు

19 మంది నివేదికల కోసం వెయిటింగ్‌


చిత్తూరు, మార్చి 30 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఇప్పటివరకు మొత్తం 73 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. వీరిలో శ్రీకాళహస్తికి చెందిన యువకుడికి మాత్రమే పాజిటివ్‌ వచ్చింది. అతను ప్రస్తుతం తిరుపతిలోని ఐసోలేషన్‌ వార్డులో చికిత్స పొందుతున్నారు. 53 మంది రిపోర్టులు నెగెటివ్‌గా వచ్చాయి. ఇంకా 19 మందికి చెందిన ఫలితం రావాల్సి ఉంది. ఇదిలాఉండగా.. జిల్లాలో ఏర్పాటుచేసిన క్వారంటైన్‌ కేంద్రాల్లో రోజు రోజుకూ చేరేవారి సంఖ్య పెరుగుతోంది. ఆదివారం వరకు 86మంది ఉండగా.. సోమవారానికి ఈ సంఖ్య 255కు చేరింది. కలికిరిలోని క్వారంటైన్‌ కేంద్రంలో 88, తిరుపతిలో 41, వరదయ్యపాళెంలో 14, పలమనేరులో 28 మంది, శ్రీకాళహస్తి ఏడుగురు, పుంగనూరులో 40 మంది, సోమలలో 12మంది, సదుంలో ముగ్గురు, పెద్దపంజాణిలో 18 మంది, వి.కోటలో ఇద్దరు, గంగవరంలో ఇద్దరు చొప్పున అధికారుల పర్యవేక్షణలో ఉన్నారు.


ఫిబ్రవరి నుంచి విదేశాల నుంచి మొత్తం 2,091 మంది జిల్లాకు రాగా.. వీరిలో ప్రస్తుతం 1813 మంది హోమ్‌ ఐసోలేషన్‌లో ఉన్నారు. ముగ్గురు అనుమానితులు ఆస్పత్రిలో ఉన్నారు. ఇక పోలీసులు లాక్‌డౌన్‌ నిబంధనలను అతిక్రమించిన వారిపై కేసులు నమోదు చేస్తూనే ఉన్నారు. సోమవారం కూడా లాక్‌డౌన్‌ నిబంధన ఉల్లంఘనపై 35, రవాణా చట్టం కింద 622 కేసులు నమోదయ్యాయి. 

Updated Date - 2020-03-31T12:20:33+05:30 IST