ఎల్‌ఆర్‌ఎ‌స్‌కు 2,500 దరఖాస్తులు

ABN , First Publish Date - 2020-09-27T10:44:42+05:30 IST

ప్రభుత్వం రెండో దఫా ఇటీవల ఆన్‌లైన్‌ దరఖాస్తులకు మరో అవకాశం కల్పించడంతో పాల్వంచ మునిసిపాలిటీ పరిధిలో ఇప్పటి వరకు ఎల్‌ఆర్‌ఎ్‌సకు 2,500 పైచిలుకు ఆన్‌లైన్‌ దరఖాస్తు లు అందినట్లు

ఎల్‌ఆర్‌ఎ‌స్‌కు 2,500 దరఖాస్తులు

ఇప్పటి వరకూ రూ.25 లక్షల ఆదాయం


పాల్వంచ టౌన్‌, సెప్టెంబరు 26 : ప్రభుత్వం రెండో దఫా ఇటీవల ఆన్‌లైన్‌ దరఖాస్తులకు మరో అవకాశం కల్పించడంతో పాల్వంచ మునిసిపాలిటీ పరిధిలో ఇప్పటి వరకు ఎల్‌ఆర్‌ఎ్‌సకు 2,500 పైచిలుకు ఆన్‌లైన్‌ దరఖాస్తు లు అందినట్లు సమాచారం. తద్వారా ప్రభుత్వానికి ఆన్‌లైన్‌ దరఖాస్తు రుసుము ద్వారా రూ.25లక్షల పై చిలుకు ఆదా యం లభించింది. మునిసిపల్‌ పరిధిలో ఆన్‌లైన్‌ దరఖా స్తులు చేసుకోవడానికి అక్టోబర్‌ 15వ తేదీ వరకు ప్రభుత్వం అవకాశం కల్పించిన దృష్ట్యా పట్టణ పరిధిలో ఇంకా ఆన్‌లైన్‌ దరఖాస్తులు చేసుకునేందుకు వేలాది మంది డోలాయమా న స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. దానికి కారణం లేక పోలేదు. ప్రభుత్వం గతంలో 2015-16లో రెండు దఫాలుగా ఎల్‌ఆర్‌ఎస్‌, బీఆర్‌ఎ్‌సకు అవకాశం కల్పించింది. అప్పుడు మునిసిపాలిటీ పరిధిలో 2,637 ఎల్‌ఆర్‌ఎ్‌సకు దరఖాస్తులు చేసుకోగా రూ.పది కోట్లకు పైచిలుకు ఆదాయం చేకూరింది. వాటిలో 1200 పైచిలుకు ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులు మాత్రమే పరిష్కారానికి నోచుకున్నాయి.


మిగతావి రుసుము రూ.10వేలు కట్టించుకున్నా ప్రభుత్వం సర్వే నెంబర్లంటూ 817, 727, 444, 999 సర్వే నెంబర్లలోని స్థలా లకు బిల్డింగ్‌లకు ఎల్‌ఆర్‌ఎస్‌, బీఆర్‌ఎస్‌ వర్తింప జేయలేదు. ఈ నెంబర్లలో పేద, మధ్య తరగతి వర్గాలకు ప్ర భుత్వమే గత కొన్నేళ్ల కింద ఇంటి స్థలాలను మంజూరు చే సి ఇం దిరమ్మ ఇంటి కోటాలో హౌసింగ్‌ బోర్డు ద్వారా ఇళ్లను కూ డా మంజూరు చేశారు. దరిమిలా ఆయా సర్వే నెం బర్లలో చిన్న పేద, మధ్య తరగతి వారు స్థలాలను కొందరు కొను గోలు చేసి రిజిస్ట్రేషన్‌ పొంది కూడా ఉన్నారు. కానీ ప్రభు త్వం మాత్రం ప్రభుత్వ స్థలాలలోని ప్లాట్లు, చెరువు శిఖం, దేవాదాయశాఖ స్థలాల్లోని ప్లాట్లకు ఎల్‌ఆర్‌ఎస్‌ వర్తించదని చేసిన ప్రకటనలో ఈ వర్గాలు అయోమయ స్థితిలో కొ ట్టుమిట్టాడుతున్నారు. పాల్వంచ మునిసిపాలిటీ పరిధిలో ఎ న్నో ఏళ్లుగా పై పేర్కొన్న నెంబర్లలోని స్థలాలకు కూడా ఎల్‌ ఆర్‌ఎస్‌ అవకాశం కల్పించేలా చర్యలు తీసుకోవాలని, దానికి స్థానిక ప్రజా ప్రతినిధితోపాటు ఉన్నతాధికారులు చర్యలు తీసుకోని పేద వారికి మధ్య తరగతి వారికి ఎల్‌ఆర్‌ఎస్‌ పొందేలా అవకాశం కల్పించేలా భరోసా కల్పించాలని స్థా నికులు కోరుతున్నారు. ఇప్పటికీ కూడా నామ మాత్రపు రుసుముతో ఎల్‌ఆర్‌ఎస్‌ పొందే అవకాశం కలగజేయాలని పలువురు వేడుకుంటున్నారు. 

Updated Date - 2020-09-27T10:44:42+05:30 IST