Abn logo
Mar 26 2020 @ 17:14PM

ఏపీలోని సొంతూళ్లకు వెళదామనుకున్న టెకీలను క్వారంటైన్‌కు పంపారు..!

రాజమండ్రి: లాక్‌డౌన్ ఉల్లంఘించి బెంగళూరు, హైదరాబాద్ నగరాల నుంచి తూర్పుగోదావరి జిల్లాకు చేరుకున్న 250 మంది ఐటీ ఉద్యోగులు, విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సొంతూళ్లకు వెళదామనుకున్న 250 మందిని రావులపాలెం సమీపంలోని సిద్ధాంతం బ్రిడ్జ్ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 55 బైక్‌లు, 28 కార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.


వైద్య పరీక్షల కోసం రాజమండ్రి బొమ్మూరులోని క్వారంటైన్‌కు వారిని బస్సుల్లో తరలించారు. లాక్ డౌన్ ఉల్లంఘించిన అందరిపైనా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అమలాపురం డీఎస్‌పీ మాసూం భాషా తెలిపారు.

Advertisement