యూఏఈ నుంచి భార‌త్‌కు 25 రిపాట్రియేష‌న్ విమానాలు

ABN , First Publish Date - 2020-06-05T15:20:56+05:30 IST

క‌రోనా లాక్‌డౌన్ వ‌ల్ల వివిధ దేశాల్లో చిక్కుకుపోయిన భార‌త ప్ర‌వాసుల‌ను వందే భార‌త్ మిష‌న్ ద్వారా స్వ‌దేశానికి త‌రలిస్తున్న విష‌యం తెలిసిందే.

యూఏఈ నుంచి భార‌త్‌కు 25 రిపాట్రియేష‌న్ విమానాలు

యూఏఈ: క‌రోనా లాక్‌డౌన్ వ‌ల్ల వివిధ దేశాల్లో చిక్కుకుపోయిన భార‌త ప్ర‌వాసుల‌ను వందే భార‌త్ మిష‌న్ ద్వారా స్వ‌దేశానికి త‌రలిస్తున్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే మొద‌టి రెండు ద‌శ‌ల్లో ఇత‌ర దేశాల్లో ఇరుక్కుపోయిన వారిని భార‌త్‌కు త‌ర‌లించ‌గా ఈ నెల‌ 9 నుంచి మూడో ద‌శ ప్రారంభం కానుంది. దీనిలో భాగంగా యూఏఈ నుంచి మ‌రో 25 రిపాట్రియేష‌న్ విమాన స‌ర్వీసులు న‌డ‌వ‌నున్నాయి. 


ఈ నెల 9 నుంచి 19 వ‌ర‌కు న‌డ‌వ‌నున్న మొత్తం 25 విమాన స‌ర్వీసుల్లో 14 అబుధాబి నుంచి, మ‌రో 11 దుబాయి నుంచి భార‌త్‌లోని వివిధ గ‌మ్య ‌స్థానాల‌కు రానున్నాయి. ఈసారి మ‌హారాష్ట్ర‌కు కూడా ప్ర‌త్యేకంగా ఒక విమానం వేశారు. ఈ విమాన స‌ర్వీస్ జూన్ 19న అబుధాబి నుంచి ముంబైకు రానుంది. కేర‌ళ‌లోని నాలుగు విమానాశ్ర‌యాల‌కు 10 విమానాలు న‌డ‌వ‌నున్నాయి. మిగ‌తా‌వాటిలో న్యూఢిల్లీ, శ్రీన‌గ‌ర్‌, చండీగ‌ఢ్‌, అమృత్‌స‌ర్‌, జైపూర్‌, ల‌క్నో, బెంగ‌ళూరు, హైద‌రాబాద్‌, చెన్నై, మ‌దురై న‌గ‌రాల‌కు విమాన స‌ర్వీసులు న‌డ‌ప‌నున్న‌ట్లు సంబంధిత అధికారులు తెలియ‌జేశారు. 

Updated Date - 2020-06-05T15:20:56+05:30 IST