ప్రపంచంలో 25శాతం కరోనా కేసులు అమెరికాలోనే!

ABN , First Publish Date - 2020-08-10T04:13:29+05:30 IST

అగ్రరాజ్యం అమెరికాను కరోనా మహమ్మారి అల్లాడిస్తోంది. ఇక్కడ రోజురోజుకూ వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య భారీగా పెరిగిపోతోంది.

ప్రపంచంలో 25శాతం కరోనా కేసులు అమెరికాలోనే!

వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాను కరోనా మహమ్మారి అల్లాడిస్తోంది. ఇక్కడ రోజురోజుకూ వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య భారీగా పెరిగిపోతోంది. ప్రపంచంలో అత్యధిక కరోనా కేసులు నమోదయిన దేశం అమెరికానే. ఇక్కడి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 50లక్షల మార్కు దాటేసింది. మొత్తం ప్రపంచవ్యాప్తంగా 1.96కోట్ల కరోనా కేసులున్నాయి. అంటే వీటిలో 25శాతంపైగా ఒక్క అమెరికాలోనే ఉన్నాయన్నమాట. ఈ లెక్కన అమెరికాలోని ప్రతి 66మందిలో ఓ కరోనా పేషెంట్ ఉన్నట్లే. అలాగే ప్రపంచవ్యాప్తంగా నమోదైన 1.62,441 కరోనా మరణాల్లో కూడా దాదాపు 25శాతం అమెరికాలోనే నమోదవడం గమనార్హం.

Updated Date - 2020-08-10T04:13:29+05:30 IST