రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో 247 మంది ఖైదీలకు కరోనా

ABN , First Publish Date - 2020-08-07T22:47:59+05:30 IST

రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో 247 మంది ఖైదీలకు కరోనా

రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో 247 మంది ఖైదీలకు కరోనా

రాజమహేంద్రవరం, తూర్పుగోదావరి: కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. అయినప్పటికీ రోజురోజుకూ రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో 247 మంది ఖైదీలు, 32 సిబ్బందికి కరోనా పరీక్షలు చేయగా కోవిడ్-19 పాజిటివ్ వచ్చిందని వైద్య అధికారులు పేర్కొన్నారు. మొత్తం 1,600 మందిలో 900 మంది ఖైదీలకు మొదటి దశ వైద్య పరీక్షలను ఐమాస్క్ అనే మొబైల్ ద్వారా నిర్వహించారు. కరోనా నియంత్రణ వ్యూహంలో భాగంగా కొత్త రిమాండ్ ఖైదీల ప్రవేశాన్ని జైలు అధికారులు నిలిపివేశారు. 


Updated Date - 2020-08-07T22:47:59+05:30 IST