లోక్‌ అదాలత్‌లో 2,452 కేసుల పరిష్కారం

ABN , First Publish Date - 2022-06-27T05:46:05+05:30 IST

జిల్లా వ్యాప్తంగా ఆదివారం నిర్వహించిన జాతీయ లోక్‌ అదాలత్‌లో సిద్దిపేట పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలోని 2,452 కేసుల్లో ఇరువర్గాల మధ్య రాజీ కుదిర్చినట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి రఘురాం తెలిపారు. ఆదివారం సిద్దిపేట జిల్లా కోర్టు ఆవరణలో నిర్వహించిన జాతీయలోక్‌ అదాలత్‌లో ఆయన పాల్గొని మాట్లాడారు.

లోక్‌ అదాలత్‌లో 2,452 కేసుల పరిష్కారం
సిద్దిపేట కోర్టులో నిర్వహించిన లోక్‌ అదాలత్‌లో రాజీ కాపీని కక్షిదారులకు అందజేస్తున్న న్యాయమూర్తి

చిన్న కేసులకు కోర్టుల వెంబడి తిరిగి విలువైన సమయాన్ని, డబ్బును వృథా చేసుకోవద్దు 

జిల్లా ప్రధాన న్యాయమూర్తి రఘురాం


సిద్దిపేట క్రైం, జూన్‌ 26 : జిల్లా వ్యాప్తంగా ఆదివారం నిర్వహించిన జాతీయ లోక్‌ అదాలత్‌లో సిద్దిపేట పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలోని 2,452 కేసుల్లో ఇరువర్గాల మధ్య రాజీ కుదిర్చినట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి రఘురాం తెలిపారు. ఆదివారం సిద్దిపేట జిల్లా కోర్టు ఆవరణలో నిర్వహించిన జాతీయలోక్‌ అదాలత్‌లో ఆయన పాల్గొని మాట్లాడారు. చిన్న చిన్న కేసులకు కోర్టుల వెంబడి తిరిగి తమ విలువైన సమయాన్ని, డబ్బును వృథా చేసుకోవద్దని సూచించారు. ఈ లోక్‌అదాలత్‌లో రోడ్డు ప్రమాదాల కేసుల్లో బాధితులకు రూ.1,35,000 నష్టపరిహారం చెల్లించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్‌ సెషన్స్‌ జడ్జి భవాని, సీనియర్‌ సివిల్‌ జడ్జి సంతోష్‌ కుమార్‌, అడిషనల్‌ జూనియర్‌ జడ్జి కుమారి, బార్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ జనార్దన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


గజ్వేల్‌లో 1,367 కేసులు పరిష్కారం 

గజ్వేల్‌రూరల్‌ : గజ్వేల్‌ కోర్టులో ఆదివారం నిర్వహించిన జాతీయ లోక్‌అదాలత్‌లో 1,367 కేసులు పరిష్కరించినట్లు ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి వెంకట మల్లిక సుబ్రహ్మణ్యశర్మ, ప్రిన్సిపల్‌ అడిషనల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి మహ్మద్‌ అబ్ధుల్‌ ఖలీల్‌ తెలిపారు. రాజీపడదగిన 1,367 కేసులను పరిష్కరించేందుకు కృషిచేసిన ప్రతీ ఒక్కరిని న్యాయమూర్తులు అభినందించారు. ఈ కార్యక్రమంలో పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ శంకర్‌, అసిస్టెంట్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ విజయసుధా, న్యాయవాదులు, ఆయా బ్యాంకుల మేనేజర్లు, మండల లీగల్‌ సర్వీస్‌ సభ్యులు, సిబ్బంది పాల్గోన్నారు. 


హుస్నాబాద్‌లో 299 కేసులు 

హుస్నాబాద్‌ : హుస్నాబాద్‌ మున్పిఫ్‌ కోర్టులో నిర్వహించిన లోక్‌ అదాలత్‌లో 299 కేసులను రాజీ కుదుర్చుకున్నారు. ఈ సందర్భంగా మున్సిఫ్‌ కోర్టు జూనియర్‌ సివిల్‌ జడ్జి శివరంజని మాట్లాడుతూ కేసులతో సంవత్సరాల తరబడి కోర్టుల చుట్టు తిరుగుతూ సమయం, డబ్బు వృథా చేసుకోకుండా  లోక్‌ అదాలత్‌లో పరిష్కరించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి కృష్ణతేజ్‌, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌లు రవికిరణ్‌, నాగరాజు, లోక్‌అదాలత్‌ సభ్యులు, న్యాయవాదులు పాల్గొన్నారు.   


Updated Date - 2022-06-27T05:46:05+05:30 IST