240 కర్ణాటక మద్యం బాటిళ్లు సీజ్‌.. ఇద్దరి అరెస్ట్‌

ABN , First Publish Date - 2022-09-23T05:37:33+05:30 IST

కర్ణాటక నుంచి ట్రాన్స్‌పోర్టు ద్వారా మద్యాన్ని దిగుమతి చేసుకుని విక్రయించేందుకు ప్రయత్నించిన ఇద్దరి నిందితులను అరెస్టు చేసి, వారి నుంచి 240 మద్యం బాటిళ్లను సీజ్‌ చేశామని ఎక్సైజ్‌ సీఐ సురేఖ తెలిపారు.

240 కర్ణాటక మద్యం బాటిళ్లు సీజ్‌.. ఇద్దరి అరెస్ట్‌
సీజ్‌ చేసిన మద్యం సీసాలు, పట్టుబడిన నిందితులు

నరసాపురం/మొగల్తూ రు, సెప్టెంబరు 22: కర్ణాటక నుంచి ట్రాన్స్‌పోర్టు ద్వారా మద్యాన్ని దిగుమతి చేసుకుని విక్రయించేందుకు ప్రయత్నించిన ఇద్దరి నిందితులను అరెస్టు చేసి, వారి నుంచి 240 మద్యం బాటిళ్లను సీజ్‌ చేశామని ఎక్సైజ్‌ సీఐ సురేఖ తెలిపారు. గురువారం కార్యాలయంలో ఆమె విలేకర్లతో మాట్లాడుతూ మొగల్తూరు మండలం కేపీపాలెంకు చెందిన ఆకెన శ్రీనివాసరావు, రాజేష్‌ కర్ణాటక నుంచి ఆర్టీసీ ట్రాన్స్‌పోర్టు ద్వారా మద్యం బాటిళ్ళను దిగుమతి చేసుకున్నారన్నారు. నాన్‌ డ్యూటీ లిక్కర్‌ బాటిళ్లు వచ్చాయన్న సమాచారంతో దాడులు నిర్వహించామన్నారు. వీరి ఇళ్లల్లో కర్ణాటక మద్యం దొరకడంతో అరెస్టు చేసి మద్యాన్ని సీజ్‌ చేశామన్నారు. ఎస్‌ఐ నర్సింహారావు, సిబ్బంది దుర్గాప్రసాద్‌, కృష్ణవేణి, స్వర్ణ పాల్గొన్నారు.

Updated Date - 2022-09-23T05:37:33+05:30 IST