మధ్యాహ్నం భోజనం చేసి గదిలోకి వెళ్లిన 24ఏళ్ల యువకుడు.. సాయంత్రం వేళ రూమ్‌‌లో కనిపించిన దృశ్యం చూసి అతడి వదిన షాక్

ABN , First Publish Date - 2022-02-21T21:23:12+05:30 IST

అతడికి 24ఏళ్లు. ఇంజినీరింగ్ పూర్తి చేసిన అతడు.. తన అన్న ఫ్యామిలీతో కలిసి ఉంటున్నాడు. ఆదివారం మధ్యాహ్నం భోజనం చసిన ఆ యువకుడు.. నిద్రొస్తోందంటూ తన గదిలోకి వెళ్లిపోయాడు. సాయంత్రం అయినా గది నుంచి బయటకు రాలేదు. దీంతో అతడి వదిన ఆ యువకుడి గదిలోకి వెళ్లింది. ఈ క్ర

మధ్యాహ్నం భోజనం చేసి గదిలోకి వెళ్లిన 24ఏళ్ల యువకుడు.. సాయంత్రం వేళ రూమ్‌‌లో కనిపించిన దృశ్యం చూసి అతడి వదిన షాక్

ఇంటర్నెట్ డెస్క్: అతడికి 24ఏళ్లు. ఇంజినీరింగ్ పూర్తి చేసిన అతడు.. తన అన్న ఫ్యామిలీతో కలిసి ఉంటున్నాడు. ఆదివారం మధ్యాహ్నం భోజనం చసిన ఆ యువకుడు.. నిద్రొస్తోందంటూ తన గదిలోకి వెళ్లిపోయాడు. సాయంత్రం అయినా గది నుంచి బయటకు రాలేదు. దీంతో అతడి వదిన ఆ యువకుడి గదిలోకి వెళ్లింది. ఈ క్రమంలో అక్కడ కనిపించిన దృశ్యం చూసి షాకైంది. ఒక్కసారిగా గట్టిగా కేకలు వేసింది. ఇంతకూ ఏం జరిగిందనే వివరాల్లోకి వెళితే..


మధ్యప్రదేశ్‌లోని చింద్వారా ప్రాంతానికి చెందిన రాజ్‌కుమార్ సాహూకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు ఆశిష్ సివిల్ ఇంజినీరింగ్ పూర్తి చేసి ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నాడు. ఇతడికి పెళ్లై ఓ అబ్బాయి కూడా జన్మించాడు. ఇకపోతే రాజ్‌కుమార్ రెండో కుమారుడు సూరజ్ రాహూ (24) కూడా ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. చదువు పూర్తైన తర్వాత ఆశిష్ ఫ్యామిలీలో కలిసి ఉంటూ.. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ క్రమంలో ఆదివారం మధ్యాహ్నం ఎప్పటిలాగే అందరితో కలిసి భోజనం చేసిన సూరజ్.. నిద్రొస్తోందంటూ తన గదికి వెళ్లిపోయాడు. అయితే సాయంత్రం అయినా అతడు తన గది నుంచి బయటకు రాలేదు. దీంతో ఆశిష్ భార్య సూరజ్ గదికి వెళ్లింది. అనంతరం అక్కడ కనిపించిన దృశ్యం చూసి షాకైంది. ఉరేసుకుని సూరజ్ ఆత్మహత్యకు పాల్పడటాన్ని చూసి గట్టిగా కేకలు వేసింది. విషయం తెలియడంతో అక్కడకు చేరుకున్న ఇతర కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. అయితే అతడి గదిలో మాత్రం ఎటువంటి సూసైడ్ నోట్ పోలీసులకు లభించలేదు. 



ఇదిలా ఉంటే.. సూరజ్ తాను చదువుకునే రోజుల్లో ఓ అమ్మాయిని పేమించాడని అతడి కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అయితే అతడి ప్రేమను ఆమె కుటుంబ సభ్యులు అంగీకరించలేదన్నారు. సూరజ్‌కు ఉద్యోగం లేదనే కారణంతో మూడు రోజుల క్రితం ఆమెకు మరొకరితో వివాహం చేసినట్టు పేర్కొన్నారు. దీంతో మనస్తాపానికి లోనైన సూరజ్.. ఆత్మహత్య చేసుకున్నాడని వెల్లడించారు. 


Updated Date - 2022-02-21T21:23:12+05:30 IST