మచిలీపట్నంలో నేడు 24 గంటల కర్ఫ్యూ

ABN , First Publish Date - 2020-04-05T12:52:13+05:30 IST

మచిలీపట్నంలో నేడు 24 గంటల కర్ఫ్యూ

మచిలీపట్నంలో నేడు 24 గంటల కర్ఫ్యూ

4 నుంచి 10 వార్డుల వరకు రెడ్‌జోన్‌  ఇళ్లకే నిత్యావసరాలు : మంత్రి పేర్ని నాని    ఆంధ్రజ్యోతి - మచిలీపట్నం :   చిలకలపూడిలో కోవిడ్‌ - 19 పాజిటివ్‌ కేసు శనివారం నమోదైందని మంత్రి పేర్ని నాని తెలిపారు. ఆర్‌ అండ్‌ బి అతిథి గృహంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మచిలీపట్నంలో పాజిటివ్‌ కేసు నమోదు కావడం దురదృష్టకర మన్నారు. సామాజిక బాధ్యతగా భావించి ప్రతి ఒక్కరూ ఇంటికే పరిమితం కావాలన్నారు.  నగరంలో ఆదివారం పూర్తి స్థాయిలో 24 గంటల పాటు కర్ఫ్యూ విధించామన్నారు.  పాజిటివ్‌ కేసు నమోదైన ప్రాంతం నుంచి కిలోమీటరు పరిధిలోని కొత్త డివిజన్లు 4,5,6,7,8,9,10లో ఐదు రోజుల పాటు కర్ఫ్యూ విధించామన్నారు. నవీన్‌మిట్టల్‌ కాలనీ, సీతయ్యనగర్‌, హమాలీ కాలనీల్లో కూడా కర్ఫ్యూ అమలులో ఉంటుందన్నారు. ప్రభుత్వం నుంచి తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఈ డివిజన్లలోని ప్రజలు ఇంటి నుంచి బయటకు రావొద్దన్నారు.    ప్రజలకు అవసరమైన మందులు, కూరగాయలు, నిత్యావసరాలు ఇంటి వద్దకే తీసుకువచ్చి ఇస్తారని, వాటికి సొమ్ము చెల్లించా లన్నారు. పాలు ఉదయం 6 నుంచి 9 గంటల వరకు, సాయంత్రం 5 నుంచి 7 గంటల వరకు అందజేస్తామన్నారు.  నిత్యావసరాలు, మందులు, కూరగాయలను ఉదయం 6 నుంచి సాయంత్రం 5 వరకు ఇస్తారన్నారు. పాజిటివ్‌ కేసు నమోదైన వ్యక్తితో కలిసి తిరిగిన వారంతా స్వీయ గృహ నిర్బంధానికే పరిమితం కావాలన్నారు. వీరిలో ఎవరికైనా అనారోగ్య లక్షణాలు ఉంటే వెంటనే అధికారులు వలంటీర్లు, పోలీసులకు సమాచారం ఇచ్చి ఆసుపత్రిలో చేరాలని సూచించారు. ఢిల్లీ వెళ్లొచ్చిన వారిలో ఇద్దరికి నెగిటివ్‌ రిపోర్టులు వచ్చాయన్నారు. ఒకటి రెండు రోజుల్లో వారిని క్వారంటైన్‌ నుంచి గృహ నిర్బంధానికి పంపుతామన్నారు.

Updated Date - 2020-04-05T12:52:13+05:30 IST