రూ.5 కోట్లతో 24 రైతు భవనాలు

ABN , First Publish Date - 2020-07-10T10:14:27+05:30 IST

నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో రూ.5 కోట్ల వ్యయంతో రైతు వేదిక భవన నిర్మాణాలు చేపడుతున్నట్లు తాండూరు ఎమ్మెల్యే ఫైలట్‌ రోహిత్‌రెడ్డి

రూ.5 కోట్లతో  24  రైతు భవనాలు

తాండూరు ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌రెడ్డి 


బషీరాబాద్‌: నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో రూ.5 కోట్ల వ్యయంతో రైతు వేదిక భవన నిర్మాణాలు చేపడుతున్నట్లు తాండూరు ఎమ్మెల్యే ఫైలట్‌ రోహిత్‌రెడ్డి వెల్లడించారు. బషీరాబాద్‌ మండలం మంతట్టి, కాశీంపూర్‌, నవాంద్గీ, ఎక్మాయి, నవాల్గ గ్రామాల్లో గురువారం రైతు వేదిక భవన నిర్మాణాలకు ఎమ్మెల్యే భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం రైతు వేదికలకు శ్రీకారం చుట్టిందన్నారు. అనంతరం ఆయా గ్రామాల్లో హరితహారం కింద మొక్కలను నాటారు.


అదే విధంగా మాసన్‌పల్లి గిరిజన తండా వరకు బీటీ రోడ్డు నిర్మాణం చేపట్టాలని సర్పంచ్‌ గొల్ల బీమప్ప, గిరిజనులు నవాల్గ గ్రామం వద్ద ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డిని కలిసి కోరారు. ఈ మేరకు ఆయన పీఆర్‌డీఈ, తహసీల్దార్‌తో చర్చించి, పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో పీఆర్‌డీఈ గోపినాథ్‌, ఏడీఏ శంకర్‌రథోడ్‌, బషీరాబాద్‌ మార్కెట్‌ చైర్మన్‌ ఆరుణాగోపాల్‌రెడ్డి, వైస్‌ చైర్మన్‌ బి.శ్రీనివాస్‌, ఏవో నాగంకృష్ణ, ఏఈవో శివ, నాయకులు ఇందర్‌చెడ్‌ రాజు, రామునాయక్‌, చందర్‌, రంగారెడ్డి, మోహన్‌, సర్పంచులు దశరథ్‌, సి.వెంకటయ్య, నాదీర్గ నారాయణ, డి.నర్సింహులు, శివనాయక్‌, సాబేర్‌ తదితరులు పాల్గొన్నారు. 

 

ప్రతి క్లస్టర్‌కు ఓ వ్యవసాయ విస్తరణాధికారి

యాలాల : ప్రతి క్లస్టర్‌కు ఓ వ్యవసాయ విస్తీర్ణాధికారిని నియమించనున్నట్లు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి తెలిపారు. యాలాల మండల పరిధిలోని అగ్గనూరు, జుంటుపల్లి, రాస్నం, కోకట్‌ గ్రామాల్లో రైతు వేదిక భవన నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అనంతరం ఇటీవల వర్షాలకు దెబ్బతిన్న కోకట్‌ కాగ్నా నది బ్రిడ్జిని పరిశీలించారు. మూడు నాలుగు రోజుల్లో మరమ్మతులు చేయిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎంపీపీ బాలేశ్వర్‌గుప్తా, వైస్‌ ఎంపీపీ రమేష్‌, ఎంపీటీసీ గరివెప్ప, అక్బర్‌బాబా, విఠల్‌నాయక్‌, సర్పంచ్‌ భీమప్ప, ఏవో జోత్స్నప్నియదర్శిని, ఎంపీడీవో తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-07-10T10:14:27+05:30 IST