24 బీరుబాటిళ్లు స్వాధీనం...యువకుడు అరెస్టు

ABN , First Publish Date - 2021-12-06T05:09:14+05:30 IST

ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా మద్యం బాటిళ్లు విక్ర యిస్తున్న బి.హరీష్‌ అనే యువకుడిని అరెస్టు చేసి, అతని వద్ద నుంచి 24 బీరుబాటిళ్లు స్వాధీనం చేసుకున్నట్లు వన్‌టౌన్‌ సీఐ ఎన్‌వీ నాగరాజు తెలిపారు.

24 బీరుబాటిళ్లు స్వాధీనం...యువకుడు అరెస్టు
పట్టుబడిన నిందితుడు, బీరుబాటిళ్లను చూపుతున్న సీఐ నాగరాజు, సిబ్బంది

ప్రొద్దుటూరు క్రైం, డిసెంబరు 5 : ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా మద్యం బాటిళ్లు విక్ర యిస్తున్న బి.హరీష్‌ అనే యువకుడిని అరెస్టు చేసి, అతని వద్ద నుంచి 24 బీరుబాటిళ్లు స్వాధీనం చేసుకున్నట్లు వన్‌టౌన్‌ సీఐ ఎన్‌వీ నాగరాజు తెలిపారు. ఆదివారం సాయంత్రం వన్‌టౌన్‌ సర్కిల్‌ కార్యాలయంలో వివరాలు వెల్ల డించారు.  వివేకానంద నగర్‌ కాలనీకి చెందిన హరీష్‌ ఉదయం మేదరవీధి జంక్షన్‌ వద్ద బీరుబాటిళ్లు విక్రయిస్తుండగా ఎస్‌ఐ రాజారెడ్డి, సిబ్బందితో కలిసి అరెస్టు చేసినట్లు సీఐ చెప్పారు. పట్టుబడిన యువకుడి వద్ద నుంచి 24 కింగ్‌ఫిషర్‌ బీరుబాటిళ్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ నాగరాజు తెలిపారు. సమావేశంలో ఎస్‌ఐ రాజారెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.  

Updated Date - 2021-12-06T05:09:14+05:30 IST