Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Thu, 07 Jul 2022 04:09:21 IST

ఆహార సంక్షోభంలో 230 కోట్ల మంది: ఐరాస

twitter-iconwatsapp-iconfb-icon

ఐరాస, జూలై 6: ప్రపంచవ్యాప్తంగా 230 కోట్ల మంది తిండి లేక ఆకలి సమస్యతో బాధపడుతున్నారని ఐక్యరాజ్యసమితి నివేదిక వెల్లడించింది. వీళ్లలో 92 కోట్ల మంది తీవ్ర ఆహార భద్రత ముప్పును ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. ప్రపంచ జనాభా ఎనిమిది వందల కోట్లు. అంటే ఈ భూమ్మీద ఉన్న జనాభాలో పావు వంతుకు పైగా ప్రజలు ఆకలి సమస్యను ఎదుర్కొంటున్నారు. 2021 సంవత్సరానికి సంబంధించిన ుప్రపంచ ఆహార భద్రత నివేదిక్‌ను యూఎన్‌ విడుదల చేసింది. 34 కోట్ల మంది తీవ్ర ఆహార కొరతతో అలమటిస్తున్నారని వాపోయింది. శరీరానికి అవసరమైనంత మేర పోషకాహారం తీసుకోలేని వాళ్ల సంఖ్య 310 కోట్లకు పెరిగినట్టు అందులో పేర్కొన్నది. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఆహార ధరలు మానవ ఆరోగ్యంపై ఎలాంటి దుష్ప్రభావం చూపిస్తున్నాయో చెప్పేందుకు ఇది నిదర్శనమని తెలిపింది. 

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.