కడప నగరంలో 23 తాత్కాలిక రైతు మార్కెట్లు

ABN , First Publish Date - 2020-04-10T09:18:27+05:30 IST

భౌతికదూరం పాటించాలనే ఉద్దేశ్యంతో కలెక్టరు హరికిరణ్‌ ఆదేశాల మేరకు నగరంలోని 50 డివిజన్లకు గాను 23 తాత్కాలిక కూరగాయల రైతు మార్కెట్లను

కడప నగరంలో 23 తాత్కాలిక రైతు మార్కెట్లు

కడప (నాగరాజుపేట), ఏప్రిల్‌ 9 : భౌతికదూరం పాటించాలనే ఉద్దేశ్యంతో కలెక్టరు హరికిరణ్‌ ఆదేశాల మేరకు నగరంలోని 50 డివిజన్లకు గాను 23 తాత్కాలిక కూరగాయల రైతు మార్కెట్లను కార్పొరేషన్‌ అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. 3వ డివిజన్‌లో తిలక్‌నగర్‌ సర్కిల్‌, 10 జయనగర్‌ కాలనీ ఉన్నత పాఠశాల, 11లో అంబేద్కర్‌ భవన్‌లో నిర్వహించనున్నారు. అలాగే 12వ డివిజన్‌లోని గురుకుల్‌ విద్యాపీఠ్‌, 13 ఆర్టీసీ బస్టాండు, 16 అగాడివీధిలో నిర్వహిస్తున్నారు. అలాగే 20వ డివిజన్‌లో గాంధీనగర్‌ పాఠశాల, 21 నాగరాజుపేట హైస్కూలు, 22వ డివిజన్‌ సీఎ్‌సఐ స్కూలు, 24వ డివిజన్‌లో కడ్డీల బడిలో నిర్వహించనున్నారు.


27వ డివిజన్‌లో మార్కెట్‌ యార్డు, 30వ డివిజన్‌ పాత బస్టాండు, 31వ డివిజన్‌ చెన్నూరు బస్టాండు, 33 మట్టి పెద్దపులి బొమ్మ ఎదురుగా, 34 పెద్ద దర్గా ఎదురుగా 36వ డివిజన్‌ సహారా కళ్యాణ మండపంలో నిర్వహించనున్నారు. 38వ డివిజన్‌ ఎర్రబడి స్కూలు, 39వ డివిజన్‌ రామకృష్ణ కళాశాల 41వ డివిజన్‌ రాజ్‌కళ్యాణ మండపం, 43వ డివిజన్‌ కాగితాలపెంట వార్డు కార్యాలయం 46వ డివిజన్‌ ఐటీఐ సర్కిల్‌, 47వ డివిజన్‌ అక్కాయపల్లె వార్డు కార్యాలయం, 50వ డివిజన్‌ సాయిపేట మఠం బడిలో నిర్వహించనున్నారు.

Updated Date - 2020-04-10T09:18:27+05:30 IST