Advertisement
Advertisement
Abn logo
Advertisement

సముద్రం నుంచి బయటపడిన భారీ వింతజీవి... నోటిలో ఏనుగు దంతాలు!

లండన్: సోషల్ మీడియాలో ఇటీవల ఒక వింత సముద్ర జీవికి సంబంధించిన ఫొటో వైరల్‌గా మారింది. యూకేలోని వేల్స్‌లో గల బ్రాడ్ హెవన్ సౌత్ బీచ్ ఒడ్డున ఈ వింత జీవిని అక్కడి ప్రజలు గమనించారు. ఇటువంటి జీవి ఇంతకు ముందెప్పుడు కనిపించలేదు. 

అత్యంత భారీ కాయం కలిగి, దాని నోటిలో ఏనుగు దంతాలు ఉండటాన్ని చూసిన స్థానికులు భయపడిపోయారు. పైగా ఆ వింతజీవి సగం చేపలా మరో సగం డైనోసార్ మాదిరిగా కనిపిస్తోంది. నీటిలో నుంచి కొట్టుకువచ్చిన ఆ జీవి మృతి చెందింది. ఆ జీవి మృత కళేబరాన్ని పరిశోధనల కోసం తరలించారు. 23 అడుగుల పొడవువున్న ఈ జీవిని చూడగానే పరిశోధకులు కూడా ఆశ్చర్యపోయారు. ఈ జీవి సముద్రంలోనే చనిపోయివుంటుందని వారు భావిస్తున్నారు.

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement