23 ఎక్స్‌ప్రెస్‌ రైళ్ళలో అన్‌ రిజర్వుడ్‌ బోగీలు

ABN , First Publish Date - 2022-03-15T16:22:30+05:30 IST

మదురై డివిజన్‌లో నడిచే 23 ఎక్స్‌ప్రెస్‌ రైళ్ళలో అన్‌ రిజర్వుడ్‌ బోగీలను అందుబాటులోకి తీసుకొచ్చారు. దీనిపట్ల ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కరోనా సమయలో అనేక ఎక్స్‌ప్రెస్‌ రైళ్ళలోని అ

23 ఎక్స్‌ప్రెస్‌ రైళ్ళలో అన్‌ రిజర్వుడ్‌ బోగీలు

అడయార్‌(చెన్నై): మదురై డివిజన్‌లో నడిచే 23 ఎక్స్‌ప్రెస్‌ రైళ్ళలో అన్‌ రిజర్వుడ్‌ బోగీలను అందుబాటులోకి తీసుకొచ్చారు. దీనిపట్ల ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కరోనా సమయలో అనేక ఎక్స్‌ప్రెస్‌ రైళ్ళలోని అన్‌ రిజర్వుడ్‌ బోగీలను రిజర్వుడ్‌ బోగీలుగా మార్చారు. అప్పటి నుంచి ఇప్పటివరకు ఇదే విధానాన్ని అమలు చేస్తున్నారు. అయితే, కరోనా వైరస్‌ గణనీయంగా తగ్గడంతో రాష్ట్ర వ్యాప్తంగా సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో మదురై రైల్వే డివిజన్‌ పరిధిలోని రైళ్ళలో అన్‌ రిజర్వుడ్‌ బోగీలను దశల వారీగా అందుబాటులోకి తెస్తున్నారు. తొలుత 23 ఎక్స్‌ప్రెస్‌ రైళ్ళలో వీటిని అమర్చారు. 20602 నంబరుతో మదురై - చెన్నై సెంట్రల్‌ మధ్య నడిచే ఎక్స్‌ప్రెస్‌, 22624 నంబరు తంజావూరు ప్రధాన మార్గంలో చెన్నై ఎగ్మోర్‌ వరకు నడిచే ఎక్స్‌ప్రెస్‌లున్నాయి. వీటితో పాటు తూత్తుక్కుడి - చెన్నై ముత్తునగర్‌ ఎక్స్‌ప్రెస్‌ (నంబరు 12694), తిరునెల్వేలి - చెన్నై - తిరునె ల్వేలి మధ్య నడిచే (12632) ఎక్స్‌ప్రెస్‌, మదురై - చెన్నై ఎక్స్‌ప్రెస్‌ (12638) పాండ్యన్‌ ఎక్స్‌ప్రెస్‌, సెంగోట్టై - చెన్నై (నంబరు 12662) పొదిగై ఎక్స్‌ప్రెస్‌, రామేశ్వరం - చెన్నై (నంబరు 16852), రామేశ్వరం - చెన్నై సేతు ఎక్స్‌ప్రెస్‌ (22662), తిరుచ్చెందూరు - చెన్నై సెంధూర్‌ ఎక్స్‌ప్రెస్‌ (16780) ఎక్స్‌ప్రెస్‌తో సహా మొత్తం 23 రైళ్ళు ఉన్నాయి. అయితే, ఈ అన్‌ రిజర్వుడ్‌ బోగీలను ఈ నెల 16, 20వ తేదీల్లో దశల వారీగా అందుబాటులోకి తీసుకునివస్తారు. 

Updated Date - 2022-03-15T16:22:30+05:30 IST