కాకినాడలో 23మంది అనుమానితులు

ABN , First Publish Date - 2020-03-29T09:33:06+05:30 IST

కరోనా అనుమానిత లక్షణాలతో శనివారం 22మంది కాకినాడ జీజీహెచ్‌లోని ఐసోలేషన్‌ వార్డుకు వచ్చారు. వీరందరి నుంచి శాంపిళ్లు సేకరించి పరీక్షలకు...

కాకినాడలో 23మంది అనుమానితులు

కాకినాడ/విశాఖపట్నం, మార్చి 28(ఆంధ్రజ్యోతి): కరోనా అనుమానిత లక్షణాలతో శనివారం 22మంది కాకినాడ జీజీహెచ్‌లోని ఐసోలేషన్‌ వార్డుకు వచ్చారు. వీరందరి నుంచి శాంపిళ్లు సేకరించి పరీక్షలకు పంపారు. జీజీహెచ్‌లో కరోనా చికిత్స పొందుతున్న యువకుడి(23) పరిస్థితి కుదుటపడింది. మరికొన్ని రోజులు చికిత్స అందించిన డిశ్చార్జి చేయాలని నిర్ణయించారు. విశాఖలో కరోనా బారినపడిన వృద్ధుడు(66) కోలుకుంటున్నట్టు వైద్యులు చెబుతున్నారు. ఆయన వైరస్‌ బారినపడినట్టు నిర్ధారించిన వైద్యులు ప్రత్యేక వార్డులో చికిత్స అందిస్తున్నారు. శనివారం మొదటిదశ పరీక్షల్లో నెగటివ్‌ వచ్చింది. 4రోజులు తరువాత మరోదశ పరీక్షలు నిర్వహించి, అందులోనూ నెగటివ్‌ వస్తేనే బాధితుడిని డిశ్చార్జి చేస్తారు. 

Updated Date - 2020-03-29T09:33:06+05:30 IST