గూండా చట్టం కింద 23 మంది అరెస్టు

ABN , First Publish Date - 2022-02-21T16:51:07+05:30 IST

గ్రేటర్‌ చెన్నైలో పలు నేరాలకు సంబంధించి 23 మందిని గూండా చట్టం కింద అరెస్ట్‌ చేసినట్లు నగర పోలీస్‌ కమిషనర్‌ శంకర్‌జివాల్‌ తెలిపారు. ఆయన ఆదివారం మీడియాతో

గూండా చట్టం కింద 23 మంది అరెస్టు

చెన్నై/ప్యారీస్‌: గ్రేటర్‌ చెన్నైలో పలు నేరాలకు సంబంధించి 23 మందిని గూండా చట్టం కింద అరెస్ట్‌ చేసినట్లు నగర పోలీస్‌ కమిషనర్‌ శంకర్‌జివాల్‌ తెలిపారు. ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ, మహా నగరంలో హత్య, హత్యాయత్నం తదితర నేరాలకు సంబంధించి, బహిరంగ ప్రాంతాల్లో విధ్వంసాలు సృష్టించేవారు, చైన్‌ స్నాచింగ్‌, మహిళల పట్ల అసభ్యకరంగా వ్యవహరించేవారు, మాదకద్రవ్యాల స్మగ్లర్ల చర్యలకు అడ్డుకట్ట వేసేందుకు తమ శాఖ ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. గత 50 రోజుల్లో వివిధ నేరాలకు పాల్పడిన 23 మందిని గూండా చట్టం కింద అరెస్ట్‌ చేసినట్లు కమిషనర్‌ తెలిపారు.

Updated Date - 2022-02-21T16:51:07+05:30 IST