పాజిటివ్‌ 3000 ప్లస్‌

ABN , First Publish Date - 2020-07-12T10:32:29+05:30 IST

జిల్లాలో కొవిడ్‌ కేసులు జెట్‌ స్పీడ్‌లో పెరుగుతున్నాయి. కొత్త రికార్డులు నమోదు అవుతున్నాయి. శనివారం ఒకే రోజు

పాజిటివ్‌ 3000 ప్లస్‌

ఒకే రోజు 229 కరోనా కేసులు

బాధితుల సంఖ్య 3168

మరో నాలుగు మరణాలు

97కి చేరిన మృతుల సంఖ్య


కర్నూలు(హాస్పిటల్‌), జూలై 11: జిల్లాలో కొవిడ్‌ కేసులు జెట్‌ స్పీడ్‌లో పెరుగుతున్నాయి. కొత్త రికార్డులు నమోదు అవుతున్నాయి. శనివారం ఒకే రోజు 229 మందికి వైరస్‌ నిర్ధారణ అయింది. లాక్‌డౌన్‌ అమలులోకి వచ్చాక ఇదే అత్యధిక సంఖ్య. తాజా కేసులతో జిల్లాలో కరోనా బాధితుల సంఖ్య 3168కి చేరింది. ఇందులో 1258 యాక్టివ్‌ కేసులు కాగా, 1813 మంది డిశ్చార్జి అయ్యారు. కర్నూలు నగరంలో తాజాగా 71 కేసులు వచ్చాయి. ఎమ్మిగనూరులో 43, నందికొట్కూరులో 37, నంద్యాలలో 30, ఆదోనిలో 11, డోన్‌లో 7 కేసులు నమోదయ్యాయి. జిల్లాలో శనివారం నలుగురు కొవిడ్‌ బాధితులు మృతి చెందారు. దీంతో మరణాల సంఖ్య 97కు చేరింది.  


11 రోజుల్లో 1213 కేసులు

జిల్లాలో గడచిన 11 రోజుల్లో 1213 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఒకటో తేదీన 90, 2న 75, 3న 16, 4న 118, 5న 97, 6న 136, 7న 84, 8వ తేదీన 51, 9వ తేదీన 73, 10వ తేదీన 144, 11న 229 మందికి పాజిటివ్‌ వచ్చింది. జిల్లాలో శాంపిల్స్‌ ఎక్కువగా సేకరిస్తున్నామని, అందుకే పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నాయని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. జిల్లాలో సేకరించిన నమూనాల్లో 1.54 శాతం మందికి పాజిటివ్‌ వస్తోందని, మిగతా జిల్లాల కంటే మెరుగ్గా ఉన్నామని అంటున్నారు. 


కర్నూలులో ఆగని వ్యాప్తి

కర్నూలు నగరంలో కరోనా వైరస్‌ వ్యాప్తి ఆగడం లేదు. తాజాగా వచ్చిన 71 కేసులతో కలిపి బాధితుల సంఖ్య 1173కు చేరింది. చిత్తారి వీధిలో 60 ఏళ్ల వృద్ధురాలు, ఖండేరిలో ఇద్దరు, అశోక్‌నగర్‌లో, లేబర్‌ కాలనీ, ట్రినిటీ స్కూల్‌ ప్రాంతం, నెహ్రూనగర్‌ ఒకరికి వైరస్‌ సోకింది. సీతారాంనగర్‌లో ఒకరికి వైరస్‌ సోకింది. ఎన్‌ఆర్‌ పేటలో అత్యధికంగా 13, బాలాజీ నగర్‌లో 10 కేసులు  వచ్చాయి. బుధవారపేట, బండిమెట్ట, సంతోష్‌నగర్‌, వెంకటరమణ కాలనీ, కండేరి, ప్రకాష్‌నగర్‌, రోజావీధి, భాగ్యనగర్‌, గౌతమి నగర్‌, వీకర్‌ సెక్షన్‌ కాలనీ, ముజఫర్‌ నగర్‌, శరీన్‌ నగర్‌, కొత్తపేటలో కేసులు నమోదు అయ్యాయి.


ఐదుగురు వైద్యులకు..

జిల్లాలో కొత్తగా ఐదుగురు వైద్యులకు కరోనా పాజిటివ్‌ వచ్చింది. ఆస్పరి ప్రాతకోట పీహెచ్‌సీ, గూడూరులో వైద్యులకు కరోనా సోకింది. కర్నూలులోని ఓ కార్పొరేట్‌ హాస్పిటల్‌లో ఫిజీషియన్‌, ఐసీయూ స్పెషలిస్టు కరోనా బారిన పడ్డారు. వీరిలో కొందరు హోం ఐసోలేషన్‌లో చికిత్స తీసుకుంటున్నారు. 


పాజిటివ్‌ వివరాలు

నంద్యాలలో మొత్తం కేసులు 400 అయ్యాయి. తాజాగా 30 మందికి పాజిటివ్‌ వచ్చింది. 


నందికొట్కూరులో 37 కేసులు వచ్చాయి. మొత్తం బాధితులు 74కు చేరారు. సాయిబాబా నగర్‌లో అత్యధికంగా 13 మందికి వైరస్‌ సోకింది. హజీ నగర్‌లో 3, కాలేజ్‌ రోడ్డులో 2, పోలీస్‌స్టేషన్‌లో ఇద్దరికి వైరస్‌ నిర్ధారణ అయింది. వీరిలో ఓ కానిస్టేబుల్‌, హోంగార్డు ఉన్నారు.


ఆదోని మున్సిపాలిటీలో 11 కేసులు వెలుగు చూశాయి. మొత్తం కేసుల సంఖ్య 500 దాటింది. ఫరీదా సాబ్‌మొహల్లాలో 3, గోషా హాస్పిటల్‌ రోడ్డులో 3, టెలికాం నగర్‌, బుడ్డేకల్‌, టీజీఎల్‌ కాలనీ, తిరుమల నగర్‌, మరాఠి గేరీలో ఒక్కో కేసు నమోదయ్యాయి. 


డోన్‌ మున్సిపాలిటీలో 7 కేసులు వచ్చాయి. మొత్తం కేసులు 86కు చేరాయి. కొత్తపేటలో 4, మారుతీ నగర్‌లో 1, టీచర్‌ కాలనీలో 2 కేసులు వచ్చాయి. ప్యాపిలి మండలంలో కొత్తగా 5 కేసులు వెలుగు చూశాయి. ప్యాపిలిలో 3, కటిక వీధి, టీచర్స్‌ కాలనీలో ఒక్కో కేసు వచ్చాయి. 


ఆత్మకూరు మున్సిపాలిటీలో 4 కేసులు వెలుగు చూశాయి. మొత్తం కేసుల సంఖ్య 82కు చేరింది. బండి ఆత్మకూరు మండలం ఏ.కోడూరులో 3 కేసులు వెలుగు చూశాయి. పగిడ్యాల మండలం ఆంజనేయ నగర్‌, శిరివెల్ల మండలం వెంకటాపురం, వెలుగోడు మండలం వేల్పనూరు, మిడ్తూరులో ఒక్కో కేసు వచ్చాయి. 


గూడూరు మున్సిపాలిటీలో 2 కేసులు వచ్చాయి. వీరిలో ఓ వైద్యురాలు ఉన్నారు. గూడూరు మండలం కె.నాగులాపురంలో ఓ వ్యక్తికి కరోనా సోకింది. 


కర్నూలు మండలం భూపాల్‌నగర్‌, బి తాండ్రపాడులో ఒక్కొక్కరి వైరస్‌ సోకింది. 


బనగానపల్లె మండలం పలుకూరులో ఒకరికి, కోడుమూరులో ఒకరికి, సి బెళగల్‌ మండలం కంబదహాల్‌లో ఒకరికి వైరస్‌ సోకింది. 


మంత్రాలయం మండలం చిలకలడోన, కౌతాలం మండలం ఉరుకుందలో ఒకరికి, క్రిష్ణగిరి మండలం టి.గోపాలపాడులో ఒకరికి వైరస్‌ వచ్చింది.  


 శనివారం పాజిటివ్‌ కేసులు 

కర్నూలు కార్పొరేషన్‌ - 71

ఎమ్మిగనూరు మున్సిపాలిటీ - 43

నందికొట్కూరు మున్సిపాలిటీ - 37

నంద్యాల మున్సిపాలిటీ - 30

ఆదోని మున్సిపాలిటీ - 11

డోన్‌ మున్సిపాలిటీల - 7

ప్యాపిలి - 5

ఆత్మకూరు మున్సిపాలిటీ - 4

బండి ఆత్మకూరు - 3

గూడూరు మున్సిపాలిటీ - 2

కర్నూలు రూరల్‌ భూపాల్‌నగర్‌, బి.తాండ్రపాడు - 2

బనగానపల్లె (పలుకూరు) - 1

సి.బెళగల్‌ (కంబదహాల్‌) - 1

దేవనకొండ (కొటారుకొండ) - 1

డోన్‌ (రూరల్‌) - 1

గూడూరు (రూరల్‌) - 1

కౌతాళం (ఉరుకుందు) - 1

కోడుమూరు - 1

మంత్రాలయం (చిలకలడోన) - 1

పగిడ్యాల (ఆంజనేయనగర్‌) - 1

శిరివెల్ల - 1

వెలుగోడు - 1

Updated Date - 2020-07-12T10:32:29+05:30 IST