రాష్ట్రంలో కొత్తగా 2,214 కేసులు

ABN , First Publish Date - 2020-10-02T08:09:42+05:30 IST

రాష్ట్రంలో బుధవారం కొత్తగా 2,214 కరోనా కేసులు నమోదయ్యాయి. వైర్‌సతో మరో 8 మంది ప్రాణాలు కోల్పోయారు.

రాష్ట్రంలో కొత్తగా 2,214 కేసులు

హైదరాబాద్‌, అక్టోబరు 1(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో బుధవారం కొత్తగా 2,214 కరోనా కేసులు నమోదయ్యాయి. వైర్‌సతో మరో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం బాధితుల సంఖ్య 1,93,600కి, మృతుల సంఖ్య 1,135కి చేరింది. తాజాగా 2,474 మంది కోలుకోవడంతో.. మొత్తం రికవరీల సంఖ్య 1,63,407 అయింది. రికవరీ రేటు 84.40గా ఉంది. 29,058 యాక్టివ్‌ కేసులున్నాయని వైద్య శాఖ  పేర్కొంది. వీరిలో 23,702 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు పేర్కొంది.


బుఽధవారం నాటి 54,443 పరీక్షలతో మొత్తం సంఖ్య 30,50,444కి పెరిగింది. మరో 1,393 నమూనాల ఫలితాలు రావాల్సి ఉంది. తెలంగాణలో ప్రతి 10 లక్షల జనాభాకు 81,957 మందికి పరీక్షలు చేస్తున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. కాగా, మెదక్‌ జిల్లాలో ర్యాపిడ్‌ యాంటీజెన్‌ టెస్టింగ్‌ కిట్లు గల్లంతయ్యాయి.


గత నెల 12వ తేదీన సంగారెడ్డిలోని సెంట్రల్‌ డ్రగ్‌ స్టోర్‌ నుంచి ర్యాపిడ్‌ కిట్ల బాక్స్‌లను మెదక్‌ తరలిస్తుండగా ఒక బాక్స్‌ తక్కువగా వచ్చింది.  రెండు రోజుల తర్వాత జిల్లా సర్వేలైన్స్‌ అధికారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. 15రోజులు గడిచినా కిట్ల గల్లంతుపై స్పష్టత రాలేదు. కాగా, ఏపీలో కొత్తగా 6,751 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.


Updated Date - 2020-10-02T08:09:42+05:30 IST