స్కర్ట్ ధరించినందుకు యువతిపై దాడి

ABN , First Publish Date - 2020-09-25T21:11:14+05:30 IST

ఫ్రాన్స్‌లో స్కర్ట్ ధరించినందుకు 22 ఏళ్ల ఓ యువతిపై ముగ్గురు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు..

స్కర్ట్ ధరించినందుకు యువతిపై దాడి

ప్యారిస్:  స్కర్ట్ ధరించినందుకు 22 ఏళ్ల ఓ యువతిపై ఫ్రాన్స్‌లో ముగ్గురు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. తాను ఇంటికి నడిచి వెళ్తుండగా నిందితుల్లో ఒకడు తనను ఉద్ధేశించి అసభ్యకరంగా మాట్లాడాడని బాధితురాలు ఎలీజబెత్ పేర్కొంది. ఆ ముగ్గురిలో ఇద్దరు వ్యక్తులు తనను పట్టుకోగా, మూడో వ్యక్తి ముఖంపై కొట్టాడని ఆమె వాపోయింది. దీని కారణంగా తన కంటికి తీవ్ర గాయమైనట్టు ఎలిజబెత్ పేర్కొంది. దాడి జరిగిన సమయంలో దాదాపు డజను మందికి పైగా తన చుట్టూ ఉన్నా... ఒక్కరు కూడా తనను కాపాడేందుకు ముందుకు రాలేదని ఆవేదన వ్యక్తం చేసింది. కాగా ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్టు ఫ్రాన్స్ పోలీసులు వెల్లడించారు. మహిళలపై అకృత్యాలు పెరిగిపోతున్నాయంటూ ఆందోళన పెల్లుబుకుతున్న నేపథ్యంలోనే ఈ ఘటన చోటుచేసుకోవడంతో.. దీన్ని ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. ఇలాంటి చర్యలను ఉపేక్షించబోమనీ.. నిందితులను  గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొంది. 

Updated Date - 2020-09-25T21:11:14+05:30 IST