22 ఏళ్ల యువతి.. పెళ్లయిన వ్యక్తితో ప్రేమాయణం.. విషయం భార్యకు తెలిశాక అనూహ్య పరిణామం.. చివరకు..

ABN , First Publish Date - 2021-10-03T01:16:22+05:30 IST

ఇంటర్నెట్ డెస్క్: ఆమెకు 22ఏళ్లు. పొట్టకూటి కోసం ఓ ఇంట్లో పని చేస్తోంది. ఆమె పని చేసే చోటే.. ఓ వ్యక్తి కూడా డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఇద్దరూ ఒకచోటే పని చేస్తుండటంతో వారి మధ్య పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం క్రమంగా ప్రేమగా మారింది.

22 ఏళ్ల యువతి.. పెళ్లయిన వ్యక్తితో ప్రేమాయణం.. విషయం భార్యకు తెలిశాక అనూహ్య పరిణామం.. చివరకు..

ఇంటర్నెట్ డెస్క్: ఆమెకు 22ఏళ్లు. పొట్టకూటి కోసం ఓ ఇంట్లో పని చేస్తోంది. ఆమె పని చేసే చోటే.. ఓ వ్యక్తి కూడా డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఇద్దరూ ఒకచోటే పని చేస్తుండటంతో వారి మధ్య పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం క్రమంగా ప్రేమగా మారింది. వాని ప్రేమ వ్యవహారం కాస్తా.. తాజాగా సదరు వ్యక్తి ఇంట్లో తెలియడంతో అతడి భార్య అగ్గిలం మీద గుగ్గిలం అయింది. అత్తను వెంట బెట్టుకుని సరాసరి ఆ యువతి ఇంటికి బయల్దేరింది. ఆ తర్వాత ఏం జరిగిందనే వివరాల్లోకి వెళితే..


 మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన కాజల్ (22) స్థానికంగా ఉన్న ఓ కేక్ ఫ్యాక్టరీ ఓనర్ ఇంట్లో పని చేస్తోంది. సోనూ అనే వ్యక్తి కూడా అక్కడే డ్రైవర్‌గా జాబ్ చేస్తున్నాడు. ఈ క్రమంలో కాజల్, సోను మధ్య పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమదాకా వెళ్లింది. దీంతో రోజూ వారు కలుసుకునే వారు. కొద్ది రోజులుగా సోను వ్యవహార శైలిలో తేడాను గమనిస్తున్న అతడి భార్య విషయం ఆరా తీసింది. ఈ క్రమంలోనే తన భర్త సోనూ.. కాలజ్ అనే యువతితో ప్రేమాయణం నడుపుతన్నట్లు గుర్తించింది. ఆ విషయం తెలియడమే ఆలస్యం.. తన అత్త(సోనూ తల్లి)తో కలిసి ఆమె.. కాజల్ ఇంటికి బయల్దేరింది. కాజల్ ఇంటికి చేరుకుని.. ‘నా భర్తతో ప్రేమాయణం నడుపుతావా’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.


అంతేకాకుండా కాజల్‌తోపాటు ఆమె తల్లిపై దాడి చేసి, అక్కడ నుంచి తిరుగుపయనమైంది. అయితే ఈ అవమానాన్ని తట్టుకోలేకపోయిన కాజల్.. ఇంట్లోకి వెళ్లి ఉరి వేసుకుంది. దీన్ని గమనించిన కుటుంబ సభ్యులు కాజల్‌ను ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆమెను పరీక్షించిన వైద్యులు అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించారు. దీంతో కాజల్ కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. తనకు పెళ్లైందన్న విషయాన్ని దాచి.. కాజల్‌కు సోనూ దగ్గరయ్యాడని, ఈ విషయం తెలిసి అతడి భార్య ఇంటిపైకి వచ్చి దాడి చేసిందని పేర్కొన్నారు. ఆ అవమానాన్ని తట్టుకోలేకే కాజల్ ఆత్మహత్య చేసుకుందని వివరించారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. విచారణ చేపట్టారు.

Updated Date - 2021-10-03T01:16:22+05:30 IST