22ఏళ్ల అమ్మాయి ఇంట్లో నుంచి అకస్మాత్తుగా అదృశ్యం.. తెల్లారి ఆమె అలా కనిపించడంతో షాకైన తల్లిదండ్రులు..

ABN , First Publish Date - 2021-11-01T00:58:14+05:30 IST

ఆ యువతికి సుమారు 22 ఏళ్లు ఉంటాయి. శుక్రవారం రోజు ఇంట్లో కుటుంబ సభ్యుల ముందే అటూ ఇటూ తిరిగుతూ సందడి చేసింది. ఎవరి పనుల్లో వాళ్లు ఉన్న సమయంలో.. ఇంట్లో నుంచి బయటకు వచ్చేసింది. దీంతో అప్పటి వరకూ కళ్ల ముందే ఉన్న కూ

22ఏళ్ల అమ్మాయి ఇంట్లో నుంచి అకస్మాత్తుగా అదృశ్యం.. తెల్లారి ఆమె అలా కనిపించడంతో షాకైన తల్లిదండ్రులు..

ఇంటర్నెట్ డెస్క్: ఆ యువతికి సుమారు 22 ఏళ్లు ఉంటాయి. శుక్రవారం రోజు ఇంట్లో కుటుంబ సభ్యుల ముందే అటూ ఇటూ తిరిగుతూ సందడి చేసింది. ఎవరి పనుల్లో వాళ్లు ఉన్న సమయంలో.. ఇంట్లో నుంచి బయటకు వచ్చేసింది. దీంతో అప్పటి వరకూ కళ్ల ముందే ఉన్న కూతురు అకస్మాత్తుగా కనిపించకుండా పోవడంతో తల్లిదండ్రులు కంగారు పడ్డారు. చుట్టుపక్కల వారిని అడిగారు. ఊళ్లో జల్లెడపట్టారు. అయినప్పటికీ కూతురు జాడ తెలికపోవడంతో సాయంత్రానికి పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి, మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారు. ఈ క్రమంలోనే ఆ మరుసటి రోజు ఊహించని విధంగా కూతురుని చూసి తల్లిదండ్రులు షాకయ్యారు. కాగా.. ఇంతకూ ఏం జరిగింది అనే వివరాల్లోకి వెళితే.. 



హర్యానాలోని ఝజ్జర్ జిల్లాకు చెందిన దంపతులకు మంజీత్ అనే 22ఏళ్ల కూతురు ఉంది. మానసిక సమస్యలతో బాధపడుతున్న ఆమెను తల్లిదండ్రులు కంటికి రెప్పలా చూసుకునేవారు. శుక్రవారం రోజు ఇంట్లో తన అల్లారితో సందడి చేసిన మంజీత్.. అకస్మాత్తుగా అదృశ్యమైంది. దీంతో కుటుంబ సభ్యులు కంగారు పడ్డారు. ఆచూకీ కోసం చుట్టుపక్కల వారిని సంప్రదించారు. ఊరిలో వెతికినా జాడ తెలియకపోవడంతో.. తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీసులు మిస్సింగ్ కంప్లైంట్ ఫైల్ చేశారు. ఈ నేపథ్యంలోనే మరుసటి రోజు ఉదయం.. ఊరిలో ఉన్న చెరువులో తమ కూతురి చెప్పును గుర్తించిన తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అక్కడకు చేరుకున్న పోలీసులు.. గ్రామస్థుల సహాయంతో చెరువులో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే నీటిలోంచి మంజీత్ మృతదేహాన్ని బయటపడింది. విగత జీవిగా పడి ఉన్న కూతురిని చూసి, ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. కాగా.. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించిన పోలీసులు.. ఈ ఘటనపై కేసు నమోదు  చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మంజీత్‌ను కావాలనే ఎవరైనా చెరువులో తోసేసారా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. 




Updated Date - 2021-11-01T00:58:14+05:30 IST