అనంతగిరికి 22 రోడ్లు, 3 వంతెనలు మంజూరు

ABN , First Publish Date - 2022-01-28T05:23:25+05:30 IST

కనెక్ట్‌ పాడేరు మిషన్‌ ప్రాజెక్టులో 22 రహదారులు, మూడు వంతెనలు మంజూరైనట్టు గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్‌ విభాగం సూపరింటెండెంట్‌ ఇంజనీర్‌ శ్రీనివాస్‌ తెలిపారు.

అనంతగిరికి 22 రోడ్లు, 3 వంతెనలు మంజూరు
బోనూరు రహదారిని పరిశీలిస్తున్న గిరిజన సంక్షేమశాఖ ఎస్‌ఈ శ్రీనివాస్‌


గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్‌ శాఖ ఎస్‌ఈ శ్రీనివాస్‌ 

అనంతగిరి, జనవరి 27: కనెక్ట్‌ పాడేరు మిషన్‌ ప్రాజెక్టులో 22 రహదారులు, మూడు వంతెనలు మంజూరైనట్టు గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్‌ విభాగం సూపరింటెండెంట్‌ ఇంజనీర్‌ శ్రీనివాస్‌ తెలిపారు. మండలంలోని పినకోట రహదారి నుంచి బొర్రపాలెం మీదుగా పూతికపుట్టు వరకు ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ నిధులతో జరుగుతున్న రహదారి పనులను గురువారం పరిశీలించారు. రూ. 18 కోట్లతో నిర్మిస్తున్న పనులను ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నామన్నారు. మండలంలో 22 రహదారులకు రూ.19.4 కోట్లు మంజూరయ్యాయన్నారు. త్వరలోనే పనులను ప్రారంభిస్తామన్నారు. జీలుగులుపాడు, సారవానిపాలెం, రామచంద్రాపురం గ్రామాల్లో వంతెనల నిర్మాణాలకు టెండర్ల ప్రక్రియ జరుగుతుందన్నారు. వాలాసీ, లుంగపర్తి పంచాయతీల నుంచి అనంతగిరి మండల కేంద్రానికి రింగురోడ్డు నిర్మాణానికి ప్రతిపాదనలు పంపామన్నారు. ఈ కార్యక్రమంలో డీఈఈ వంశీ జేఈఈ అప్పలనాయుడు, వర్క్‌ఇన్‌స్పెక్టర్‌ శివ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-28T05:23:25+05:30 IST