22 ఎర్రచందనం దుంగలు స్వాధీనం

ABN , First Publish Date - 2022-05-26T05:25:16+05:30 IST

మండలంలోని బాలపల్లె అటవీశాఖ రేంజి పరిధిలో మంగళవారం తిరుపతి, రైల్వేకోడూరు, కడప ప్రాంతాలకు చెందిన టాస్క్‌ఫోర్సు అధికారులు, సిబ్బంది బృందాలుగా ఏర్పడి కూంబింగ్‌ నిర్వహించారు.

22 ఎర్రచందనం దుంగలు స్వాధీనం
స్వాధీనం చేసుకున్న ఎర్రదుంగలు, అరెస్టు చేసిన స్మగ్లర్లను చూపుతున్న టాస్క్‌ఫోర్సు అధికారులు

ఐదుగురు స్మగ్లర్లు అరెస్టు


రైల్వేకోడూరు, మే 25: మండలంలోని బాలపల్లె అటవీశాఖ రేంజి పరిధిలో మంగళవారం తిరుపతి, రైల్వేకోడూరు, కడప ప్రాంతాలకు చెందిన టాస్క్‌ఫోర్సు అధికారులు, సిబ్బంది బృందాలుగా ఏర్పడి కూంబింగ్‌ నిర్వహించారు. ఈ కూంబింగ్‌లో బాలపల్లె అటవీశాఖ రేంజి పరిధిలోని అన్నదమ్ముల బండ వద్ద 22 ఎర్రచందనం దుంగలు, ఒక మోటారు సైకిల్‌, ఐదుగురు స్మగ్లర్లను పట్టుకున్నారు.  బుధవారం తిరుపతి టాస్క్‌ఫోర్సు ఎస్పీ మేడా సుందర్‌రావు మాట్లాడుతూ టాస్క్‌ఫోర్సు డీఎ్‌సపీ మురళీధర్‌ ఆధ్వర్యంలో ఆర్‌ఐలు సురే్‌షకుమార్‌, ఆలీబాషాలు తమ సిబ్బందితో బాలపల్లె రేంజి పరిధిలోని అడవిలో ముమ్మరంగా కూంబింగ్‌ చేస్తుండగా స్మగ్లర్లు తారసప డ్డారు. పారిపోయే ప్రయత్నం చేయగా రైల్వేకోడూరు మండలంలోని కె.బుడుగుంటపల్లెకి చెందిన సేమూరి శంకరయ్య, దాదినేని వేమయ్య, పొన్నాల రవిశంకర్‌ అనే స్మగ్లర్లును అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. వారి వద్ద నుంచి 5 దుంగలతో పాటు, ఒక మోటారు సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. తిరుమల పాపనాశనం వద్ద నుంచి అన్నదమ్ముల బండ వద్ద మూడు దుంగలను మోసుకుపోతున్న స్మగ్లర్లను చుట్టుముట్టి తమిళనాడు రాష్ట్రానికి చెందిన కే.రాజేంద్రన్‌ను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. అలాగే ఇదే ప్రాంతంలో 14 దుంగలు లభించాయని తెలిపారు.  మూడు సంఘటనల్లో 22 దుంగలు స్వాధీనం చేసుకున్నామని, దుంగల బరువు 480 కిలోలు ఉంటుందని తెలిపారు. వీటి విలువ రూ.45 లక్షలు ఉంటుందన్నారు. సిబ్బంది, అధికారులను టాస్క్‌ఫోర్సు ఎస్‌పీ అభినందించారు.

Updated Date - 2022-05-26T05:25:16+05:30 IST