కోజికోడ్ విమాన ప్రమాదం: సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్న 22 మందికి కరోనా

ABN , First Publish Date - 2020-08-14T22:36:02+05:30 IST

కోజికోడ్ విమాన ప్రమాదం సమయంలో సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్న 22 మంది అధికారులు కరోనా

కోజికోడ్ విమాన ప్రమాదం: సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్న 22 మందికి కరోనా

తిరువనంతపురం: కోజికోడ్ విమాన ప్రమాదం సమయంలో సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్న 22 మంది అధికారులు కరోనా బారినపడ్డారు. వందేభారత్ మిషన్‌లో భాగంగా దుబాయ్ నుంచి 184 మంది ప్రయాణికులతో వచ్చిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం విమానాశ్రయంలో ల్యాండ్ అవుతూ ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ప్రమాదంలో పైలట్, కో పైలట్ సహా 20 మంది ప్రాణాలు కోల్పోయారు. 


ప్రమాదం తర్వాత సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్న వారిలో 22 మందికి కరోనా సోకినట్టు మలప్పురం మెడికల్ అధికారి తెలిపారు. సహాయక కార్యక్రమాలు ముగిసిన తర్వాత వారిందరినీ క్వారంటైన్‌కు పంపినట్టు జిల్లా మెడికల్ అధికారి పేర్కొన్నారు. అలాగే, 600 మంది స్థానికులను కూడా క్వారంటైన్‌లో ఉండాలని సూచించినట్టు తెలిపారు. కాగా, కేరళలో నిన్న 1,564 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 39,708కి పెరిగింది.  

Updated Date - 2020-08-14T22:36:02+05:30 IST