బుర్ఖా వేసుకోలేదని కాల్చి చంపేశారు.. తాలిబన్‌ల దారుణం

ABN , First Publish Date - 2021-08-06T03:35:53+05:30 IST

అఫ్గానిస్థాన్‌ నుంచి అమెరికా సేనలు వెనుదిరుగుతుండటంతో తాలిబన్‌లు రెచ్చిపోతున్నారు. తాజాగా వారు బుర్ఖా ధరించని ఓ యువతిని(21) కాల్చి చంపేశారు.

బుర్ఖా వేసుకోలేదని కాల్చి చంపేశారు.. తాలిబన్‌ల దారుణం

కాందహార్: అఫ్గానిస్థాన్‌ నుంచి అమెరికా సేనలు వెనుదిరుగుతుండటంతో తాలిబన్‌లు రెచ్చిపోతున్నారు. తాజాగా వారు బుర్ఖా ధరించని ఓ యువతిని(21) కాల్చి చంపేశారు. బాల్ఖ్ జిల్లాల్లో బుధవారం ఈ దారుణం జరిగింది. అఫ్గానిస్థాన్ టైమ్స్‌లో ఈ ఘోరానికి సంబంధించిన వివరాలు తాజాగా ప్రచురితమయ్యాయి. కారులో కూర్చున్న యువతిని బయటకు లాగి నడి రోడ్డులో కాల్చి చంపారని అఫ్గానిస్థాన్ అధికారి ఒకరు తెలిపారు. అయితే..తాలిబన్‌ల ప్రతినిధి మాత్రం యథాప్రకారం ఈ వార్తలను ఖండించారు.  

Updated Date - 2021-08-06T03:35:53+05:30 IST