Abn logo
May 17 2021 @ 00:52AM

జిల్లాలో సరాసరి వర్షపాతం 2.1 మిల్లీమీటర్లు

  ఏలూరు సిటీ, మే 16:  జిల్లాలో అడపా దడపా వర్షాలు కురుస్తున్నాయి. గడచిన 24 గంటల్లో జిల్లాలో అత్యధికంగా భీమడోలు మండలంలో 17 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైందని జిల్లా ప్రణాళికా శాఖ ఆదివారం తెలిపింది. జిల్లాలో సరాసరి వర్షపాతం 2.1 మిల్లీమీటర్లు కాగా  లింగపాలెంలో 12.2, కాళ్ళలో 11.4, ఉంగుటూరులో 9.8, జీలుగుమిల్లిలో 8.2, ఆకివీడులో 7.2, వీరవాసరంలో 7.2, పెదవేగిలో 6, దెందులూరులో 4.2, చింతలపూడిలో 3, తాళ్ళపూడి, కామవరపు కోటలలో 2.6, పెరవలిలో 2.4 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైంది. జిల్లాలో వర్షం కురిసిన మిగిలిన  మండలాల్లో 2 మి.మీ కన్నా తక్కువగా వర్షపాతం నమోదైంది. 


Advertisement
Advertisement
Advertisement