Abn logo
Jul 25 2021 @ 01:53AM

రాష్ట్రంలో కొత్తగా 2,174 కేసులు

18 మరణాలు


అమరావతి, జూలై 24 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కరోనా వైరస్‌ వ్యాప్తి కొనసాగుతోంది. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 74,820 శాంపిల్స్‌ను పరీక్షించగా 2,174 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని, కరోనాతో మరో 18 మంది చనిపోయారని వైద్యఆరోగ్యశాఖ శనివారం వెల్లడించింది. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 19,52,513కి, కరోనా మృతుల సంఖ్య 13,241కి పెరిగింది. తాజాగా తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 18 మందికి వైరస్‌ సోకింది. ఒకరోజు వ్యవధిలో 2,737 మంది డిశ్చార్జ్‌ కావడంతో మొత్తం రికవరీల సంఖ్య 19,16,914కి చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 22,358 యాక్టివ్‌ కేసులున్నాయి. కరోనాతో కృష్ణా జిల్లాలో అత్యధికంగా ఐదుగురు మరణించారు.