Abn logo
Aug 15 2020 @ 06:38AM

ప్ర‌పంచంలో 2.11 కోట్ల మందికి సోకిన క‌రోనా

న్యూఢిల్లీ: ప్రపంచంలో కరోనా వైరస్ సోకినవారి సంఖ్య 2.11 కోట్లకు చేరుకోగా, మృతుల సంఖ్య 7.58 లక్షలకు పెరిగింది. 1.39 కోట్ల‌ మంది ఈ అంటువ్యాధి నుంచి కోలుకున్నారు. మరోవైపు, దక్షిణ అమెరికా దేశాలైన‌ మెక్సికో, బ్రెజిల్‌లో క‌రోనా వైర‌స్ మ‌రింత వేగంగా వ్యాప్తి చెందుతోంది. మెక్సికో అధ్యక్షుడు ఆండ్రెస్ మాన్యువల్ లొపెజ్ ఒబ్రేడర్ ఇక్క‌డ క‌రోనా కార‌ణంగా పెద్ద సంఖ్యలో బాధితులు మృతి చెందుతున్న విష‌యాన్ని అంగీకరించారు. యూఎస్, బ్రెజిల్ తరువాత మెక్సికోలో క‌రోనా కార‌ణంగా అత్యధిక సంఖ్యలో ప్రాణనష్టం జరిగింది. బ్రెజిల్‌లో గ‌డ‌చిన 24 గంటల్లో 60 వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. అంటువ్యాధి వ్యాప్తిచెందిన‌ తరువాత ఒకే రోజులో అత్య‌ధిక కేసులు రావ‌డం ఇది మూడ‌వ‌సారి. ఇదిలావుండ‌గా వెనిజులా రాజధాని క‌రాకాస్ గవర్నర్ డెరియో వివాస్(70) క‌రోనా కారణంగా మృతిచెందారు. 

Advertisement
Advertisement
Advertisement