ఒకే నెలలో 2వేలకు పైగా మంది ప్రవాసులను దేశం నుంచి బహిష్కరించిన Kuwait..

ABN , First Publish Date - 2021-12-01T14:02:42+05:30 IST

ఉల్లంఘనలకు పాల్పడే వలసదారులపై గల్ఫ్ దేశం కువైత్ గత కొంతకాలంగా ఉక్కుపాదం మోపుతోంది.

ఒకే నెలలో 2వేలకు పైగా మంది ప్రవాసులను దేశం నుంచి బహిష్కరించిన Kuwait..

కువైత్ సిటీ: ఉల్లంఘనలకు పాల్పడే వలసదారులపై గల్ఫ్ దేశం కువైత్ గత కొంతకాలంగా ఉక్కుపాదం మోపుతోంది. వరుసగా తినిఖీలు నిర్వహిస్తూ ఉల్లంఘనదారులను గుర్తించి దేశం నుంచి బహిష్కరిస్తోంది. ఇలా నవంబర్‌లో ఏకంగా 2వేలకు పైగా మంది ప్రవాసులను దేశం నుంచి బహిష్కరించినట్లు తాజాగా ఆ దేశ అంతర్గత మంత్రిత్వశాఖ వెల్లడించింది. ఈ మేరకు అంతర్గత శాఖమంత్రి షేక్ తమేర్ అలీ సభా అల్ సలేమ్ అల్ సభా, అండర్‌సెక్రెటరీ లెఫ్టినెంట్ జనరల్ షేక్ ఫైజల్ నవాఫ్ అల్ అహ్మద్ అల్ జబేర్ అల్ సభాకు జనరల్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ పబ్లిక్ రిలేషన్స్ అండ్ సెక్యూరిటీ మీడియా వివరాలు అందజేసింది. ఈ వివరాల ప్రకారం నవంబర్‌లో మొత్తం 2104 మంది ప్రవాసులను దేశం నుంచి బహిష్కరించారు. వీరిలో 683 మంది మహిళలు, 142 మంది పురుషులు ఉన్నారు. 

Updated Date - 2021-12-01T14:02:42+05:30 IST