Kuwait: 2వేల మంది ప్రవాసులు అరెస్ట్.. కారణం ఏంటంటే..?

ABN , First Publish Date - 2022-04-21T14:47:43+05:30 IST

పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమైనప్పటి నుంచి బుధవారం(ఏప్రిల్ 20) వరకు 2100 మంది ప్రవాసులను కువైత్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

Kuwait: 2వేల మంది ప్రవాసులు అరెస్ట్.. కారణం ఏంటంటే..?

కువైత్ సిటీ: పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమైనప్పటి నుంచి బుధవారం(ఏప్రిల్ 20) వరకు 2100 మంది ప్రవాసులను కువైత్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో చాలామంది భిక్షాటన, గ్యాంబ్లింగ్, ఇతర వివిధ నేరాలకు పాల్పడినట్లు అంతర్గత మంత్రిత్వశాఖకు చెందిన రెసిడెన్సీ అఫైర్స్ అండ్ సెక్యూరిటీ ఇన్వెస్టిగేషన్ విభాగం వెల్లడించింది. అరెస్టైన వారిలో అత్యధికులు అరబ్, ఆసియా వాసులు ఉన్నట్లు సమాచారం. భిక్షాటన చేస్తూ దొరికిన వారిలో చిన్న పిల్లలతో ఉన్నవారిని వెంటనే దేశం నుంచి బహిష్కరించాలని సంబంధిత శాఖకు సమాచారం ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. అలాగే వారి పేర్లను మరోసారి కువైత్‌లోకి ప్రవేశించకుండా ఓ ప్రత్యేక జాబితాలో చేర్చినట్లు వెల్లడించారు. వీరితో పాటు నివాస చట్టాన్ని ఉల్లంఘించిన వారి పేర్లను కూడా ఈ ప్రత్యేక జాబితాలో చేరుస్తున్నట్లు తెలిపారు. అందుకే రెసిడెన్సీ చట్టాన్ని ఉల్లంఘించిన నేరంలో పట్టుబడితే మళ్లీ జీవితంలో కువైత్‌లో అడుగుపెట్టలేరని ఈ సందర్భంగా అధికారులు హెచ్చరించారు. చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే ప్రవాసులను ఎట్టిపరిస్థితుల్లో ఉపేక్షించబోమని సెక్యూరిటీ సిబ్బంది వార్న్ చేసింది.     

Updated Date - 2022-04-21T14:47:43+05:30 IST