యూపీలో మరో 21 మందికి కరోనా.. 431కి చేరిన కేసులు..

ABN , First Publish Date - 2020-04-10T23:57:48+05:30 IST

ఉత్తర ప్రదేశ్‌లో కొత్తగా మరో 21 మందికి కొవిడ్-19 సోకినట్టు గుర్తించారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు..

యూపీలో మరో 21 మందికి కరోనా.. 431కి చేరిన కేసులు..

లక్నో: ఉత్తర ప్రదేశ్‌లో కొత్తగా మరో 21 మందికి కొవిడ్-19 సోకినట్టు గుర్తించారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు ఈ మహమ్మారి బారిన పడిన వారి సంఖ్య 431కి చేరింది. ‘‘ఇవాళ కొత్తగా నమోదైన 21 కేసులతో ఉత్తర ప్రదేశ్‌లో కోవిడ్-19 పాజిటివ్‌గా ధ్రువీకరించిన కేసుల సంఖ్య 431కి చేరింది. ఇందులో 32 మంది కోలుకుని ఇళ్లకు వెళ్లగా.. నలుగురు చనిపోయారు...’’ అని రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కాగా ప్రస్తుతం 8,671 మందిని క్వారంటైన్లో ఉంచామనీ.. మరో 459 మందిని ఐసోలేషన్ వార్డులకు తరలించామని ప్రభుత్వం వెల్లడించింది. 


కాగా దేశ వ్యాప్తంగా మొత్తం కరోనా కేసుల సంఖ్య ఇవాళ 6,412కు చేరినట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. గత 12 గంటల్లోనే 547 మంది కరోనా బారిన పడినట్టు గుర్తించామని తెలిపింది. కరోనా కారణంగా ప్రస్తుతం 5709 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతుండగా.. 504 మంది కోలుకుని ఇళ్లకు వెళ్లారని కేంద్రం పేర్కొంది. కరోనా కారణంగా 199 మంది ప్రాణాలు కోల్పోయినట్టు వెల్లడించింది.  

Updated Date - 2020-04-10T23:57:48+05:30 IST