Abn logo
Mar 7 2021 @ 11:58AM

లారీ, బొలెరీ వాహనం ఢీ.. 21 మందికి గాయాలు

విజయనగరం: కొమరాడ పోలీస్ స్టేషన్‌కు సమీపంలో బంగారమ్మపేట వద్ద లారీ బొలెరో వాహనం ఢీకొనడంతో 21 మంది తీవ్ర గాయాల పాలయ్యారు. క్షతగాత్రులంతా మక్కువ మండలం కోన గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. బాధితులు రాయఘడ మజ్జిగౌరమ్మ దర్శనానికి వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.

Advertisement
Advertisement
Advertisement