Advertisement
Advertisement
Abn logo
Advertisement

21 మద్యం బాటిళ్లు స్వాధీనం

చెన్నూరు, అక్టోబరు 24: రామనపల్లె వద్ద అక్రమంగా మద్యం విక్రయిస్తున్న కొల్లపాటి నరసింహులును అరెస్టు చేసి, అతని వద్ద నుంచి 21 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఐ శ్రీనివాసులు తెలిపారు. ఇటీవల మండల పరిధిలోని గ్రామాల్లో అక్రమంగా మద్యం విక్రయిస్తూ పలువురు పట్టుబడ్డారన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఇలాంటి పనులు చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. 

కర్ణాటక మద్యం స్వాధీనం- ఒకరి అరెస్టు 

బద్వేలు, అక్టోబరు 24: పట్టణంలోని మైదుకూరు రోడ్డు గుంతపల్లె క్రాస్‌ రో డ్డు వద్ద పుల్లయ్య అనే వ్యక్తి వద్దనుం చి నాలుగు కర్ణాటక మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుని అతన్ని అరె స్టు చేసినట్లు బద్వేలు అర్బన్‌ సీఐ రామచంద్ర తెలిపారు. ఈ దాడుల్లో కానిస్టేబుల్‌ శ్రీనివాసులు, కె.సుబ్బ య్య, తదితరులు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement