Afghanistan crisis: భారత్‌కు ఫ్రాన్స్ సాయం

ABN , First Publish Date - 2021-08-19T23:34:56+05:30 IST

అఫ్ఘానిస్థాన్‌లో సంక్షోభం వేళ భారత్‌కు ఫ్రాన్స్ భారీ సాయం చేసింది. కాబూల్‌లో చిక్కుకున్న 21 మంది భారత పౌరులను పారిస్‌కు తరలించింది.

Afghanistan crisis: భారత్‌కు ఫ్రాన్స్ సాయం

న్యూఢిల్లీ: అఫ్ఘానిస్థాన్‌లో సంక్షోభం వేళ భారత్‌కు ఫ్రాన్స్ భారీ సాయం చేసింది. కాబూల్‌లో చిక్కుకున్న 21 మంది భారత పౌరులను పారిస్‌కు తరలించింది. కాబూల్‌లోని తన రాయబార కార్యాలయం నుంచి భారతీయులను పారిస్‌ తీసుకెళ్లింది. ఈ సందర్భంగా ఫ్రెంచ్ విదేశాంగ మంత్రి జీన్ వైవ్స్ లీ డ్రియాన్‌కు భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. ఫ్రాన్స్ మంత్రి లీ డ్రియాన్‌‌తో జైశంకర్ ఫోన్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా ఇరువురి మధ్య అఫ్ఘాన్‌లో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులపై చర్చ జరిగినట్లు తెలిసింది. కాగా, ఈ 21 మంది ఫ్రెంచ్ ఎంబసీ వద్ద సెక్యూరిటీగా పని చేస్తున్నట్లు సమాచారం. ఇక మిత్ర దేశమైన భారత్‌కు సాయం చేయడంలో ఫ్రాన్స్ ఎప్పుడూ వెనుకాడబోదని, ఇరుదేశాల మధ్య మంచి సమన్వయం ఉందంటూ భారత్‌కు ఫ్రెంచ్ రాయబారి ఇమ్మాన్యుయేల్ లెనైన్ బుధవారం ట్వీట్ చేశారు. ఇదిలాఉంటే.. భారత్ కాబూల్ నుంచి ఎంబసీ సిబ్బంది మొత్తాన్ని మంగళవారం స్వదేశానికి తరలించిన విషయం తెలిసిందే. 


Updated Date - 2021-08-19T23:34:56+05:30 IST