తిరుపతి: కోవిడ్ వైద్య సేవలకు 209 మంది నర్సింగ్ సిబ్బంది ఎంపిక

ABN , First Publish Date - 2020-08-03T19:08:28+05:30 IST

తిరుపతి: కోవిడ్ వైద్య సేవలకు 209 మంది నర్సింగ్ సిబ్బంది ఎంపికయ్యారని జిల్లా వైద్య అధికారి డాక్టర్ ఎం.పెంచలయ్య తెలిపారు.

తిరుపతి: కోవిడ్ వైద్య సేవలకు 209 మంది నర్సింగ్ సిబ్బంది ఎంపిక

తిరుపతి: కోవిడ్ వైద్య సేవలకు 209 మంది నర్సింగ్ సిబ్బంది ఎంపికయ్యారని జిల్లా వైద్య అధికారి డాక్టర్ ఎం.పెంచలయ్య తెలిపారు. నేడు ఆయన ఏబీఎన్‌తో మాట్లాడుతూ.. అయిదు వందల మంది ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. వైద్య సేవలలో వారికి ఉన్న పూర్వ అనుభవానికి ప్రాధాన్యత ఇచ్చామన్నారు. నెలకు 28 వేలు జీతం ఇవ్వనున్నామన్నారు. కోవిడ్ బాధితుల సేవకు 110 మంది దంత వైద్యులు ముందుకు వచ్చారని పెంచలయ్య తెలిపారు. తిరుపతిలోని కోవిడ్ వైద్య కేంద్రాల్లో, కుప్పం, మదనపల్లె, చిత్తూరుల్లోని కొవిడ్ వైద్య కేంద్రాల్లో వీరి సేవలను వినియోగించుకుంటామన్నారు. నెలకు 54 వేలు జీతం ఇవ్వనున్నామన్నారు. ఇంకా వైద్యుల పోస్టులను భర్తీ చేయాల్సి ఉందన్నారు.

Updated Date - 2020-08-03T19:08:28+05:30 IST