Abn logo
Jul 31 2021 @ 18:08PM

ఏపీలో కొత్తగా 2,058 కరోనా కేసులు

అమరావతి: రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై ఉన్నతాధికారులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. రాష్ట్రంలో కొత్తగా 2,058 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనాతో 23 మంది మరణించారు. ఏపీలో మొత్తం 19,66,175 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కరోనాతో మొత్తం 13,377 మంది మృతి చెందారు. గత 24 గంటల్లో 2,053 మంది రికవరీ చెందారు.  21,180 యాక్టివ్‌ కేసులు నమోదయ్యాయి. మొత్తం 78,992 శాంపిల్స్‌ సేకరించారు. మొత్తం 19,31,618 మంది రికవరీ చెందారు.


చిత్తూరు జిల్లాలో ఐదుగురు మృతి, కృష్ణాలో నలుగురు మృతి చెందారు. నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ముగ్గురు చొప్పున మృతి చెందారు. తూ.గో, గుంటూరు, కర్నూలు జిల్లాల్లో ఇద్దరు చొప్పున , శ్రీకాకుళం, విశాఖలో ఒకరు చొప్పున మృతి చెందారు.