తాన్లా లాభంలో 204శాతం వృద్ధి

ABN , First Publish Date - 2020-08-13T06:05:54+05:30 IST

తాన్లా సొల్యూషన్స్‌ జూన్‌తో ముగిసిన మూడు నెలలకు రూ.78.6 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఏడాది క్రితం ఇదే కాలంతో పోలిస్తే ఇది 204 శాతం అధికం. ఆదాయం 15 శాతం వృద్ధి చెంది రూ.455.5 కోట్లకు...

తాన్లా లాభంలో 204శాతం వృద్ధి

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): తాన్లా సొల్యూషన్స్‌ జూన్‌తో ముగిసిన మూడు నెలలకు రూ.78.6 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఏడాది క్రితం ఇదే కాలంతో పోలిస్తే ఇది 204 శాతం అధికం. ఆదాయం 15 శాతం వృద్ధి చెంది రూ.455.5 కోట్లకు చేరింది. ఈపీఎస్‌ 196 శాతం వృద్ధితో రూ.5.17గా నమోదైంది. కొవిడ్‌ అన్ని పరిశ్రమలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నప్పటికీ.. కంపెనీ డిజిటల్‌,  క్లౌడ్‌ కమ్యూనికేషన్స్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నందున ఆదాయం, లాభం పెరిగాయని తాన్లా చైర్మన్‌, ఎండీ ఉదయ్‌ రెడ్డి తెలిపారు. 


Updated Date - 2020-08-13T06:05:54+05:30 IST