అనంతపురం: టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు 2024లో జరిగే సాధారణ ఎన్నికలే చివరి ఎన్నికలని, ఆ తరువాత రాష్ట్ర ప్రజలు ఆయన్ను హైదరాబాద్‌కే పరిమితం చేయనున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రైతులు వాడుతున్న విద్యుత్‌ను లెక్క కట్టేందుకే మీటర్లు ఉపయోగపడతాయని, మొత్తం ఖర్చు రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు. ప్రతిపక్షాలు విద్యుత్ మీటర్లపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు. సీఎం జగన్ నాయకత్వంలో అభివృద్ధి బాటలో నడుస్తున్న ఏపీని శ్రీలంకతో పోల్చడం సరికాదని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు.