Advertisement
Advertisement
Abn logo
Advertisement

2018 విశిష్ట పురస్కారాలకు కూరెళ్ల విఠలాచార్య, కళాకృష్ణ ఎంపిక

హైదరాబాద్ సిటీ/రవీంద్రభారతి : తెలుగు యూనివర్సిటీ 2018 సంవత్సరానికి విశిష్ట పురస్కారాలకు కూరెళ్ల విఠలాచార్య, కళాకృష్ణ ఎంపికయ్యారు. ఈ నెల 12న జరిగే కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా పురస్కారంగా ఒక్కొక్కరికి రూ. లక్ష నగదు, ప్రశంసా పత్రాన్ని అందజేయనున్నట్లు వర్సిటీ ప్రకటించింది. విఠలాచార్య కవిగా, విమర్శకునిగా, ఉపాధ్యాయునిగా, సాహిత్య వ్యాప్తికి, విద్యావ్యాప్తికి సేవ చేస్తున్నారు.


యాదాద్రి భువనగిరి జిల్లా వెల్లంకి గ్రామానికి చెందిన ఆయన కవిగా 22 పుస్తకాలను వెలువరించారు. కరీంనగర్‌ జిల్లాకు చెందిన కళాకృష్ణ కూచిపూడి, ఆంధ్రనాట్యంలో గురువుగా, నర్తకునిగా విశేష సేవలందించారు. ‘నవజనార్థన పారిజాతం‘ ప్రదర్శించడంలో కళాకృష్ణ తనదైన ముద్రవేశారు. కళాభిమానులు ‘అభినవ సత్యభామ‘ అని ప్రశంసించారు. కళాకారునిగా, అధ్యాపకునిగా 45 ఏళ్ళుగా సేవలందిస్తూ వేలాది ప్రదర్శనలిచ్చారు.

Advertisement
Advertisement