కువైట్‌లో రెసిడెన్సీ పర్మిట్స్ కోల్పోయిన 2లక్షల మంది ప్రవాసులు..!

ABN , First Publish Date - 2021-03-23T12:55:06+05:30 IST

మహమ్మారి కరోనా కారణంగా స్వదేశాల్లోనే ఇరుక్కుపోవడంతో సుమారు 2 లక్షల మంది ప్రవాసులు వారి రెసిడెన్సీ పర్మిట్స్‌ను కోల్పోయినట్లు తాజాగా కువైట్ ప్రభుత్వం వెల్లడించింది.

కువైట్‌లో రెసిడెన్సీ పర్మిట్స్ కోల్పోయిన 2లక్షల మంది ప్రవాసులు..!

కువైట్ సిటీ: మహమ్మారి కరోనా కారణంగా స్వదేశాల్లోనే ఇరుక్కుపోవడంతో సుమారు 2 లక్షల మంది ప్రవాసులు వారి రెసిడెన్సీ పర్మిట్స్‌ను కోల్పోయినట్లు తాజాగా కువైట్ ప్రభుత్వం వెల్లడించింది. ప్రయాణాలపై ఆంక్షలు కొనసాగుతుండడంతో స్వదేశాలకు వెళ్లిన ప్రవాసులు తిరిగి కువైట్ రాలేకపోవడంతో ఏడాది కాలంలోనే రెండు లక్షల మంది ప్రవాసుల రెసిడెన్సీ పర్మిట్స్ గడువు ముగిసినట్లు సమాచారం. గతేడాది మార్చి 10 నుంచి 2021 మార్చి 15 వరకు ఇలా 2లక్షల మంది ప్రవాసులు కువైట్ బయట ఉండిపోవడంతో రెసిడెన్సీ పర్మిట్స్‌ను కోల్పోయారు. ఈ జాబితాలో ఈజిప్ట్ కమ్యూనిటీ మొదటి స్థానంలో ఉంటే.. ఆ తర్వాతి స్థానాల్లో భారత్, శ్రీలంక ఉన్నాయి. ఇక కువైట్ బయట ఉండిపోయిన ప్రవాసులు విమానశ్రయాలు తెరచుకున్న తర్వాత ఆన్‌లైన్ ద్వారా వారి రెసిడెన్సీ పర్మిట్స్‌ను రెన్యువల్ చేసుకోవాలని సంబంధిత అధికారులు సూచించారు. అలాగే నివాసం గడువు ముగిసిన ప్రవాసులు తిరిగి దేశంలోకి ప్రవేశించాలంటే వారి స్పాన్సర్‌లు కొత్త ఎంట్రీ వీసాలు పొందాల్సి ఉంటుందని పేర్కొన్నారు.      

Updated Date - 2021-03-23T12:55:06+05:30 IST