Donald Trump ఆరోపణల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం.. Americaలో కాసుల వర్షం కురిపిస్తోంది!

ABN , First Publish Date - 2022-06-02T00:32:35+05:30 IST

ఎటువంటి అంచనాలు లేకుండా విమర్శకుల అంచనాలను తలకిందులు చేసి బాక్సాఫీస్ వద్ద భారీ మొత్తాన్ని కొల్లగొట్టిన సినిమాలు ఇండియాలో చాలానే ఉన్నాయి. అగ్రరాజ్యం అమెరికాలో కూడా తాజాగా ఇటువంటి ఘటనే చోటు చేసుకుం

Donald Trump ఆరోపణల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం.. Americaలో కాసుల వర్షం కురిపిస్తోంది!

ఎన్నారై డెస్క్: ఎటువంటి అంచనాలు లేకుండా విమర్శకుల అంచనాలను సైతం తలకిందులు చేసి బాక్సాఫీస్ వద్ద భారీ మొత్తాన్ని కొల్లగొట్టిన సినిమాలు ఇండియాలో చాలానే ఉన్నాయి. అగ్రరాజ్యం అమెరికాలో కూడా తాజాగా ఇటువంటి ఘటనే చోటు చేసుకుంది. కేవలం ఆరోపణల ఆధారంగా తెరకెక్కిన ఓ చిత్రం.. అమెరికన్లను థియెటర్లకు క్యూ కట్టేలా చేసింది. ఊహించని విధంగా కాసుల వర్షం కురిపిస్తోంది. అక్కడి ప్రజలను అంతగా ఆకట్టుకునేలా ఆ సినిమాలో ఏముంది? అనే పూర్తి వివరాలపై ఓ లుక్కేస్తే..



America అధ్యక్ష పదవికి నవంబర్, 2020‌లో జరిగిన ఎన్నికలు గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశం అయ్యాయి. ఎన్నికల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయంటూ డొనాల్డ్ ట్రంప్ ఆరోపణలు చేయడమే ఇందుకు కారణం. అయితే అమెరికా న్యాయస్థానాలు కూడా ట్రంప్ వాదనను తప్పుబట్టాయి. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయనడానికి ఎటువంటి ఆధారాలు లేవని కేసులను కొటేశాయి. అయితే ఈ ఆరోపణల ఆధారంగా ఓ కథ రాసి ‘2000 మ్యూల్స్’(2000 Mules) అనే సినిమాగా దినేష్ డిసౌజా తెరకెక్కించారు. సినీ విశ్లేషకులు హెచ్చరికలను సైతం పట్టించుకోకుండా థియేటర్లలో విడుదల చేశాడు. కాగా.. విమర్శకుల అంచనాలను తలకిందులు చేస్తూ అమెరికాలో ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అమెరికా వ్యాప్తంగా మే 20న విడుదలైన ఈ చిత్రం.. ఇప్పటి వరకు 1.2 మిలియన్ డాలర్లు (రూ.9.29కోట్లు) వసూలు చేసింది. 


Updated Date - 2022-06-02T00:32:35+05:30 IST